స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు మోసపూరిత సందేశాలను ఎస్‌బీఐ ఖాతాదారులకు పంపిస్తున్నట్లు తెలిసింది. ఎస్‌బీఐ రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్‌లోడ్ చేయమని కొందరు మోసపూరిత మెసేజ్‌లను పంపిస్తున్నారు. వినియోగదారులు ఇలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. అనుచిత లింకుల మీద క్లిక్ చేయడం, యాప్స్ డౌన్‌లోడ్ చేయడం వంటివి చేయకూడదని ఎస్‌బీఐ పేర్కొంది.
ఇది కూడా చదవండి: RBI: రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే బ్యాంక్ సంబంధిత యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎస్‌బీఐ వెల్లడించింది. ఇన్‌స్టాలేషన్ చేయడానికి ముందే దాని గురించి తెలుసుకోవాలని పేర్కొంది. నిజంగానే ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేసుకోవడానికి కస్టమర్లు అధికారిక రివార్డ్ వెబ్‌సైట్ సందర్సించాల్సి ఉంటుంది. లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి. మెసేజ్‌లను నిజమని నమ్మి.. లింక్ మీద క్లిక్ చేస్తే తప్పకుండా మోసపోతారు. ఇప్పటికే ఇలాంటి మోసాలకు చాలామంది బలైపోయారు. కాబట్టి వినియోగదారులు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద లింకుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Thandel : తండేల్ దుల్లకొట్టే డేట్ వచ్చేసింది