Mamata Banerjee: సుప్రీంకోర్టు తీర్పును ఏ మాత్రం అంగీకరించను.. టీచర్లకు మమత మద్దతు
- సుప్రీంకోర్టు తీర్పును ఏ మాత్రం అంగీకరించను
- జైలుకెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నా
- ఉపాధ్యాయులకు మమతా బెనర్జీ మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లో 25,000 టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దీంతో వాళ్లంతా రోడ్డున పడ్డారు. సుప్రీం ధర్మాసనం తీర్పుపై ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. తనను జైల్లో పెట్టినా పర్వాలేదు.. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించబోనని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఉపాధ్యాయులకు మమత మద్దతు ప్రకటించారు. దు:ఖంతో హృదయం రాయిలా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడుతున్నందుకు తనను జైల్లో పెట్టొచ్చన్నారు. తాను బతికున్నంత వరకు ఎవరూ ఉద్యోగం కోల్పోరని హామీ ఇచ్చారు. అర్హులైన ఉపాధ్యాయులకు ఎలాంటి భయం అక్కర్లేదని.. వారి ఉద్యోగాలను కాపాడే బాధ్యత తనదేనని మమత ప్రతిజ్ఞ చేశారు. తనను ఎవరైనా సవాల్ చేస్తే.. వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో తనకు బాగా తెలుసన్నారు. ఇది ‘నా నిబద్ధత’ అన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని.. అర్హులైన ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఎక్కడికి పోవన్నారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
గత వారం సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 25,000 మంది ఉపాధ్యాయ నియామకాలను సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టింది. స్కూల్ సర్వీస్ కమిషన్ కింద 25,000 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు గత గురువారం సమర్థించింది. ఈ ప్రక్రియ అంతా మోసం.. ద్రోహంతో తారుమారు చేయబడిందని అభిప్రాయపడింది. ఈ నియామకానికి విశ్వసనీయత లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
హైకోర్టు నిర్ణయంలో ఎలాంటి తప్పు కనిపించడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి పీవీ. సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నియామకాలన్నీ మోసపూరితంగా జరిగాయని తెలిపింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు కొన్ని మార్పులు చేసింది. 2016లో నియామకం అయినప్పటి నుంచి పొందిన జీతాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం సుప్రీం ధర్మాసనం సవరించింది. అలా జీతం ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్పీంకోర్టు స్పష్టం చేసింది. ఇక మూడు నెలల్లోపు కొత్త ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.
తాజాగా సుప్రీంకోర్టు తీర్పును మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ తీర్పును అంగీకరించబోనని ప్రతిజ్ఞ బూనారు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!