పశ్చిమాసియా మరోసారి అట్టుడుకుతోంది. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. వైమానిక దాడుల్లో ఇరాన్‌లో శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామి మరణించారు. ఈ మేరకు ఇరాన్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హుస్సేన్ సలామి అమరుడయ్యాడని స్థానిక మీడియా పేర్కొంది. ఇక ఐఆర్‌జీసీ హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మేజర్ జనరల్ హుస్సేన్ సలామితో పాటు రెవల్యూషనరీ గార్డ్‌లోని ఇతర ముఖ్య అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు సమాచారం. ఈ మేరకు ఇరాన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి: AirIndia Plane Crash: కుటుంబం మొత్తాన్ని బలిగొన్న విమాన ప్రమాదం.. లండన్‌లో స్థిరపడాలని..!
ఇక ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధపడుతోంది. ఏ క్షణంలోనైనా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తం అయింది. దేశమంతా ఎమర్జెన్సీ ప్రకటించింది. దేశ పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ రక్షణ శాఖ హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ఇజ్రాయెల్
ఇక ఇజ్రాయెల్ దాడులపై అమెరికా స్పందించింది. ఇజ్రాయెల్ చేసిన దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇరాన్‌కు చెందిన అణు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇరాన్ కూడా ప్రతిదాడులకు రెడీ అవుతోంది. దీంతో ఇజ్రాయెల్ అప్రమత్తం అయింది. క్షిపణులు, డ్రోన్లలతో ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉందని పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ హెచ్చరించారు. ప్రస్తుతం దేశమంతా ఎమర్జెన్సీ ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుగానే హెచ్చరించారు. పశ్చిమాసియా ప్రమాదకరమని.. తక్షణమే దౌత్య సిబ్బంది, సైనికులు ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇక దాడులు చేయొద్దని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించారు. అయినా కూడా ఏ మాత్రం లెక్కచేయకుండా ఇజ్రాయెల్ ముందస్తు దాడులకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.