ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులు ఎక్కడకి దారి తీస్తాయేమోనని ప్రపంచ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోడీ కెనడా చేరుకున్నారు. కెనడాలోని కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడీకి ఘనస్వాగతం లభించింది. ఈరోజు, రేపు కెనడాలో పర్యటించనున్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.
హర్యానాలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన మోడల్ శీతల్ శవమై కనిపించింది. సోనిపట్‌లోని కాలువలో ఆమె మృతదేహం లభించింది. శీతల్ హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రి వెల్లడించింది. అనారోగ్య సమస్యలతో సోనియాగాంధీ ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మొదలైన యుద్ధం తాజాగా భీకర స్థాయికి చేరింది. ఇరు దేశాలు నువ్వానేనా అన్నట్టుగా దాడులు చేసుకుంటున్నాయి.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ అణు దాడి చేస్తే.. పాకిస్థాన్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌పై అణు దాడి చేస్తుందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లో సీనియర్ అధికారి, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు మొహ్సేన్ రెజాయ్ హెచ్చరించారు.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత విమాన సంస్థలు అప్రమత్తంగా ఉంటున్నాయి. ఏ చిన్న లోపం ఉన్నా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. గత నాలుగు రోజులుగా రెండు దేశాల మధ్య డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించుకుంటున్నారు. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో భారీ నష్టాన్ని ఎదుర్కొంది. ఇజ్రాయెల్ ఏకధాటిగా దాడి చేయడంతో ఇరాన్లో భారీ నష్టం జరుగుతోంది.
హజ్ యాత్రికులతో ఉన్న విమాన చక్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ, నిప్పురవ్వలు రావడంతో పైలట్ అప్రమత్తమై లక్నో ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. విమానంలో ఉన్న 250 మంది హజ్ యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు.