హర్యానాలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన మోడల్ శీతల్ శవమై కనిపించింది. సోనిపట్‌లోని కాలువలో ఆమె మృతదేహం లభించింది. శీతల్ హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. జూన్ 14న ఆమె అదృశ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా శవమై కనిపించింది. గొంతు కోసి చంపినట్లుగా తెలుస్తోంది. హర్యానా సంగీత పరిశ్రమలో శీతల్ గుర్తింపు తెచ్చుకుంది.
ఇది కూడా చదవండి: Kakumanu Rajasekhar: ఎంత అణిచి వేయాలని చూస్తే.. అంత పెద్దగా ఎదుగుతాం!
కాలువలో ఒక మహిళ మృతదేహం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని సోనిపట్ పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం స్వాధీనం చేసుకున్నామని.. అది పానిపట్‌లో అదృశ్యమైన మోడల్ శీతల్‌దిగా గుర్తించినట్లు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సివిల్స్ ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Pranitha : వారి కారణంగా నేను ఇండస్ట్రీకి దూరం అయ్యాను..
ఇక కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మెడపై బలమైన గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. శీతల్ సంగీత పరిశ్రమతో సంబంధాలు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఏమైనా గొడవలు ఉన్నాయేమోనని ఆరా తీస్తున్నారు. ఈ నెల 14న తప్పిపోతే.. 15న ఆమె సోదరి ఫిర్యాదు చేసింది. గంటల వ్యవధిలోనే శీతల్ హత్యకు గురైంది.