Lucknow: హజ్ యాత్రికుల విమానంలో మంటలు.. లక్నోలో సురక్షితంగా ల్యాండింగ్
- హజ్ యాత్రికుల విమానంలో మంటలు
- లక్నోలో సురక్షితంగా ల్యాండింగ్
- సురక్షితంగా బయటపడ్డ 250 మంది యాత్రికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హజ్ యాత్రికులతో ఉన్న విమాన చక్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ, నిప్పురవ్వలు రావడంతో పైలట్ అప్రమత్తమై లక్నో ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. విమానంలో ఉన్న 250 మంది హజ్ యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. హైడ్రాలిక్ లీక్ కారణంగా చక్రంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Disha Patani : ప్రతి ఒక్క ఓటమిని స్వీకరిస్తా..
Also Read
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన SV 3112 విమానం శనివారం రాత్రి 10.45 గంటలకు జెడ్డా నుంచి 250 మంది హజ్ యాత్రికులతో లక్నోకు బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా పైలట్ గుర్తించాడు. పైలట్ వెంటనే విమానాన్ని ఆపి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడు. ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం విమానాన్ని వెనక్కి నెట్టి టాక్సీవేకు తరలించారు. అక్కడ ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించేశారు.
ఇది కూడా చదవండి: Israel-Iran War: ఇజ్రాయెల్ నిప్పుల వర్షం.. బంకర్‌లోకి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!
ఇక విమానాశ్రయ అత్యవసర బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని.. నురుగు మరియు నీటిని ఉపయోగించి 20 నిమిషాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అకస్మాత్తుగా హైడ్రాలిక్ లీక్ కావడం వల్లే వీల్ చక్రం హీటెక్కినట్లుగా గుర్తించారు. టేకాఫ్ సమయంలో ఈ సమస్య జరిగి ఉంటే తీవ్రమైన ప్రమాదానికి దారితీసి ఉండేదని అధికారులు తెలిపారు. జెడ్డా నుంచి హజ్ యాత్రికులను తీసుకువచ్చిన ఈ విమానం సౌదీ అరేబియాకు తిరిగి ఖాళీగా వెళ్లాల్సి వచ్చింది.
ఇటీవల అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయి 241 మంది ప్రయాణికులు చనిపోయారు. అలాగే హాస్టల్ మీద కూలడంతో 34 మంది మెడికోలు కూడా చనిపోయారు. చికిత్స పొందుతున్న వారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరుగుతుంది.
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!