ఉత్తరప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలు కారణంగా యమునా, గంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నీటి మట్టం క్షణం క్షణం పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో రెండు వందలకు పైగా గ్రామాలు నీట మునిగిపోయాయి. వేలాది ఎకరాల పంట నాశనం అయింది. వరదలు కారణంగా ఫతేపూర్‌లోని కాన్పూర్-బందా రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

ప్రస్తుతం యమునా, గంగా నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇక యోగి ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. సహాయ చర్యల్లో పాల్గొనాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి బాధితుడికి సాయం అందాలని తెలిపారు. అలాగే తాత్కాలిక శిబిరాల్లో బాధితులకు అన్ని ఏర్పాట్లు జరిగేలా చూడాలని కోరారు. ఇక పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: Ashwini Vaishnaw: పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన
వరదలు కారణంగా 402 గ్రామాలను ప్రభావితం చేశాయని.. 84,392 మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. అందరికీ సహాయం అందిస్తున్నట్లు ప్రభుత్వాధికారి తెలిపారు. ఇక 2,759 జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రిలీఫ్ కమిషనర్ భాను చంద్ర గోస్వామి వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 62 ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. ఇక అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖకు ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చింది. వారణాసిలో గంగానది నీటిమట్టం 71.50 మీటర్లకు చేరింది.
ఇది కూడా చదవండి: Donlad Trump: ‘‘ ఆమె పెదాలు మెషిన్‌గన్‌లా కదులుతాయి..’’ కరోలిన్ లెవిట్‌పై ట్రంప్ సె*క్సీ కామెంట్స్..
ఇదిలా ఉంటే సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అస్సాంలో రానున్న రెండు రోజులు, కేరళలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.