వామ్మో.. సిల్వర్‌కు ఏమైంది? మునుపెన్నడూ లేని విధంగా వెండి ధర సునామీ సృష్టిస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు లక్ష రూపాయులు ఉండేది. ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ రెండు లక్షలకు దూసుకొచ్చింది. ఇక్కడితో ఆగిపోతుందేమోనని భావించారు. కానీ మరోసారి రికార్డ్ సృష్టించేందుకు పరుగులు పెడుతోంది. ఈ వారంలోనే దాదాపు రూ.50,000 పెరిగిందంటే ఏ రేంజ్‌లో దూసుకెళ్తుందో చెప్పనక్కర్లేదు. ఇక హైదరాబాద్‌లో ఈ ఒక్కరోజే ఏకంగా రూ.20,000 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.2,74,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే అతిత్వరలోనే 3 లక్షల మార్కు చేరడం ఖాయమనిపించేలా ఉంది. ఇక కొనుగోలుదారులైతే వామ్మో.. అంటూ హడలెత్తిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Ukraine: ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీకి ముందు కీవ్‌లో భారీ పేలుళ్లు.. మళ్లీ ఉత్కంఠ
బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండిపై రూ.11,000 పెరిగింది. దీంతో సరికొత్త రికార్డ్ స్థాయిలో ధర దూసుకుపోతుంది. ఈరోజు కిలో వెండి ధర రూ.2,51, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్‌లో మాత్రం ఈరోజు రూ.20,000 పెరగడంతో కిలో వెండి ధర రూ.2,74,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,51, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Ukraine-Russia: ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందానికి అడుగులు.. రేపటి భేటీపై సర్వత్రా ఉత్కంఠ!
ఇక బంగారం ధర కూడా దూసుకుపోతుంది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,200 పెరిగి.. రూ.1,41,220 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,100 పెరిగి రూ.1,29,450 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.900 పెరిగి రూ.1,05,920 దగ్గర ట్రేడ్ అవుతోంది.