చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వ కుట్ర ఉందని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అనుమానాలు వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికైన చంద్రబాబు కళ్లు తెరుచుకోవాలని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వంలోని ఏ ఒక్కరూ చంద్రబాబు అరెస్టును ఖండించకపోవడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు హర్షకుమార్.. ఇప్పటికైనా టీడీపీ, జనసేన పార్టీలు.. ఎన్నికల్లో ఎన్డీఏను వదిలి బయటకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ, జనసేన పిలుపు మేరకు […]