Grandhi Srinivas: పవన్ కల్యాణ్‌పై గెలిచిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కి కీలక పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Grandhi Srinivas: గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించిన ఎమ్మెల్యేకు కీలక పోస్టు అప్పగించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. శాసనసభలో ప్రభుత్వ విప్ గా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను నియమించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. మోవైపు.. శాసనమండలిలో ముగ్గురు ప్రభుత్వ విప్‌లను నియమించింది ప్రభుత్వం.. మండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, మెరిగ మురళీధర్, పాలవలస విక్రాంత్‌ను ప్రభుత్వ విప్‌లుగా నియమించారు.. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.
Read Also: Partner : పార్ట్నర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ఎప్పటి నుంచి అంటే..?
Also Read
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
కాగా, తత సార్వత్రిక ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ ఓడిపోయారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు.. ఇక, పవన్ పోటీ చేసిన మరో నియోజకవర్గం- గాజువాకలో కూడా ఓటమిపాలైన విషయం విదితమే.. మళ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్న గ్రంధి శ్రీనివాస్.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటోన్నారు.. పవన్ కల్యాణ్ ను ఓడించిన జెయింట్ కిల్లర్ గా పేరుతెచ్చుకున్నారు. ఇక, ఆ మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గ్రంధి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కూడా పవన్ కల్యాణ్ తెలియట్లేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే మరోసారి భీమవరం నుంచి పోటీ చేయాలని సవాల్ చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!