Saikata Sculpture of Lord Rama: ‘అంతా రామ మయం.. ఈ జగమంతా రామ మయం’ అనే పాట ఎన్నో సార్లు వింటుంటాం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే నినాదం.. జై శ్రీరామ్.. 550 ఏళ్ల నాటి కల సకారం అవుతుందంటూ హిందువులు ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు.. ఎటు చేసినా రామనామస్మరనే.. అన్ని ఆలయాలు.. ఈ వేడుకకు సిద్ధం అయ్యాయి.. అయోధ్యలో బాల రాముడు ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుండగా.. ఆ వేడుకను పురస్కరించుకుని.. ఒక్కొక్కరు.. ఒకలా రాముడిపై తమకు ఉన్న భక్తిని చాటుకుంటున్నారు.. అయోధ్యలో సోమవారం జరగనున్న శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని.. రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ రూపొందించిన శ్రీరాముని సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటుంది. అయోధ్య రాముని ఆగమనం అవనికే ఆనందమయం అన్న నినాదంతో ఇసుకతో శ్రీరాముని రూపాన్ని తీర్చిదిద్దారు. తన కుమార్తెలతో కలిసి శ్రీనివాస్ రూపొందించిన సైకత శిల్పాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలు తరలివస్తున్నారు.
Read Also: Ayodhya Ram Mandir : అయోధ్యలో రాములోరి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుండగా న్యూ జెర్సీ వెళ్లిన హనుమంతుడు