మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ పాలన ముగుస్తుందని జోస్యం చెప్పారు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నీతి, నిజాయితీతో పుట్టిన టీడీపీకి నేనొక పిల్లర్ లాంటి వాడిని.. అలాంటి నేను పార్టీ మారతాను అని ఎలా అంటారు? అని ప్రశ్నించారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాల్గో లిస్ట్‌పై కసరత్తుకు మూడు రోజులు బ్రేక్ ఇచ్చింది. ఇక, ఇవాళ వైసీపీ నాల్గవ జాబితాపై కసరత్తు కొనసాగనుంది.. ఇప్పటికే 59 నియోజకవర్గాల్లో మార్పులు చేసిన వైసీపీ అధిష్టానం.. మరో ఐదారు నియోజకవర్గాల్లో మార్పులపై స్పష్టతకు వచ్చింది..
మన కోనసీమ కొబ్బరి బోండాలు కూడా అయోధ్యకు వెళ్తున్నాయి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నుంచి ఈ నెల 22వ తేదీన జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కొబ్బరి బోండాలను తరలించారు