* తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690.. కిలో వెండి ధర రూ.76,400
* అమరావతి: ఇవాళ రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టనున్న స్పీకర్ తమ్మినేని. ఆనం మినహా మిగిలిన ఏడుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి విచారణకు నోటీసులు. ఉదయం పూట ముగ్గురు వైసీపీ రెబెల్స్, మధ్యాహ్నం నలుగురు టీడీపీ రెబెల్సును విచారించనున్న స్పీకర్ తమ్మినేని. అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా..? లేదా అనే అంశంపై ఉత్కంఠ.
* అమరావతి: నేడు పార్టీ నేతలతో భేటీకానున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ నెల 14వ తేదీ నుంచి గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటనలు
* విశాఖ: నేడు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పర్యటన.. సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో రోజ్ గార్ మేళాలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి.
* విశాఖ: ఆంధ్రప్రదేశ్ హక్కులు – ఆత్మగౌరవంపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల సమావేశం.. పాల్గొననున్న జేడీ లక్ష్మీ నారాయణ, చలసాని శ్రీనివాస్.
* బాపట్ల : చీరాలలో అంబేద్కర్ కాంస్య విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం, ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ , ఎమ్మెల్యే కరణం బలరాం..
* ప్రకాశం : ఒంగోలు మండలం వెంగాముక్కలపాలెంలో జగనన్న ఇండ్ల స్థలాల పంపిణీ కోసం జరుగుచున్న పనులను పరిశీలించనున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో బదిలీపై వెళ్తున్న జిల్లా ఎస్పీ మలిక గర్గ్ కు పోలీసుల ఆధ్వర్యంలో ఆత్మీయ పెరేడ్ వీడ్కోలు కార్యక్రమం..
* తిరుమల: 16వ తేదిన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఒకే రోజు సప్త వాహనాలు పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు.. ఈ సందర్భంగా 15,16,17 వ తేదిలలో తిరుపతిలో జారి సర్వదర్శన టోకేన్లు రద్దు చేసిన టీటీడీ.. 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్దన్ రెడ్డి ముత్తుకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు రూరల్ పరిధిలోని ముత్యాలపాలెంలో ఇంటింట ప్రచారం నిర్వహించనున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* నెల్లూరు: జలదంకి మండలం జమ్మలపాలెంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి
* నెల్లూరు: కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో వై.సి.పి. ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం… పాల్గొననున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి
* నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో మాజీ మంత్రి నారాయణ ఇంటింట ప్రచారం
* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ పర్యటన వివరాలు.. ధవళేశ్వరం గ్రామం యర్రకోండలో మంత్రి పర్యటన స్వచ్చత కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.. రాజమండ్రి రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి వేణు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు జిల్లా కలెక్టరేట్, మున్సిపల్, మండల, సచివాలయం పరిధిలో యథాతథంగా స్పందన.. ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరణ
* శ్రీ సత్యసాయి : పెనుకొండలో ఆసరా కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్.
* అనంతపురం : తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామ సమీపంలో వున్న గ్రామీణ పార్కు నందు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
* అనంతపురం : గుంతకల్లు మండలం నక్కల దొడ్డి గ్రామంలో నాలుగో విడత వైయస్సార్ ఆసరా కార్యక్రమం.
* గుంటూరు: నేడు మంగళగిరిలో నూతనంగా నిర్మించిన, చేనేత భవన్ ను ప్రారంభించనున్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.
* గుంటూరు: నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలీస్ కార్యాలయాలు, కలెక్టరేట్లలో స్పందన కార్యక్రమం.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న ఉన్నతాధికారులు..
* తిరుమల: 21 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,256 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 28,021 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.04 కోట్లు
* అనంతపురం : కళ్యాణదుర్గంలో మరో సమ్మెబాట పట్టిన శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు. బకాయిపడ్డ వేతనాలు చెల్లించాలని డిమాండ్.
* అనంతపురం : నేటి నుంచి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బాలోత్సవం కార్యక్రమం.
* శ్రీసత్యసాయి : కనగానిపల్లి మండలం మామిళ్లపల్లిలో ఈనెల 14 న నూతనంగా నిర్మించిన అభయాంజనేయస్వామి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం.
* అనంతపురం : బుక్కరాయసముద్రం మండలం జంతలూరు గ్రామంలో ఈనెల 16న మహంకాళి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం.
* పల్నాడు కలెక్టరేట్ లో జరగాల్సిన స్పందన కార్యక్రమం రేపటికి వాయిదా.. సమస్యల పరిష్కారానికి అర్జీలు ఇచ్చేవారు మంగళవారం స్పందన కార్యక్రమం కు హాజరవ్వాలని సూచించిన ఉన్నతాధికారులు
* అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలతో ఇవాళ ప్రభుత్వం చర్చలు. మధ్యాహ్నం 3.30 కి చర్చలకు రావాల్సిందిగా 13 ఉద్యోగ సంఘాల కు పిలుపు. 12 వ పీఆర్సీ ప్రకటన – 30 శాతం మధ్యంతర భృతి, జీఓ 11 రద్దు, కారుణ్య నియామకాలు, పెండింగ్ డీఏల విడుదల.. వంటి డిమాండ్ ల తో ఈ నెల 27 న చలో విజయవాడకు ఎన్‌జీవోల పిలుపు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె కు వెళ్తామని ఇప్పటికే హెచ్చరించిన ఉద్యోగ సంఘాలు. ఇవాళ్టి చర్చలపై ఉత్కంఠ.
* విశాఖ: నేడు విశాఖ రేంజ్ DIG గా బాధ్యతలు స్వీకరించనున్న విశాల్ గున్నీ
* గుంటూరు : ఈ నెల 15న ఫిరంగిపురంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్..
* నేడు ఎన్టీఆర్ జిల్లాలో మంత్రి విడదల రజనీ పర్యటన.. కంచికచర్లలో అంబేడ్కర్, బాబు జగజ్జేవన్ రామ్, జ్యోతి రావు పూలే, వైయస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* నేడు తిరుపతి జిల్లా తొలి మహిళా ఎస్పీగా బాధ్యతలు తీసుకోనున్న మలికా గార్గ్
* నేడు విజయనగరం ఎత్తు బ్రిడ్జ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బస్ బే ను ప్రారంభించనున్న జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు..
* నంద్యాల: బనగానపల్లె (మం) యాగంటి ఉమా మహేశ్వర స్వామి క్షేత్రం లో ప్రత్యేక పూజలు, బిల్వార్చన, స్వామి అమ్మవార్ల కు మహా మంగళహారతి
* కర్నూలు: ఓర్వకల్లు తహసిల్దార్ కార్యాలయం ఎదుట నేడు కరువు సహాయక చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘాలు ధర్నా.