పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు జనసేన పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. జనసేనాని.. భీమవరం పర్యటన మరుసటి రోజుకు వాయిదా పడినట్టు తెలిపారు..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, వైఎస్ జగన్ నా సవాల్ తీసుకుంటారా? అని ప్రశ్నించారు.. జగన్ కి నేనొక అవకాశం ఇస్తున్నా.. నాతో కలవమనండి..! అని సూచించారు. ఇక, జగన్, చంద్రబాబుని సిద్ధమా అంటున్నాడు.. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చంద్రబాబు, జగన్ కి నా సవాల్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి విగ్రహం అవసరమా..? అని ప్రశ్నించారు.
జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు..