* ఢిల్లీ: మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల.. లోక్‌సభతో పాటు ఏపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న సీఈసీ.. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు.. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించే అవకాశం
* నేడు నాగర్‌కర్నూల్‌లో బీజేపీ విజయసంకల్ప సభ.. పాల్గొననున్న ప్రధాని మోడీ.. మళ్లీ ఈ నెల 18న తెలంగాణకు ప్రధాని మోడీ
* ఏపీ: నేడు వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్.. మధ్యాహ్నం ఒంటి గంటకు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన.. వైఎస్సార్ ఘాట్ దగ్దర నివాళులర్పించిన తర్వాత అభ్యర్థు ప్రకటన
* ఢిల్లీ: ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్‌ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించి రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యే అవకాశం.
* ఢి: ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… కవితను కస్టడీ కోరనున్న ఈడీ అధికారులు.
* చారిత్రాత్మక పీపుల్స్ మార్స్ పాదయాత్ర కు నేడు ఏడాది పూర్తి.. పాదయాత్రలో చూసిన కష్టాల నుండి ఉద్భవించిన హామీలే నేడు తెలంగాణ ప్రజల ప్రభుత్వంలో ప్రజా పాలన సుపరిపాలనకు తొలి అడుగు.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం, బజారహత్నూర్ మండలం, పిప్పిరి గ్రామం నుంచి మార్చి 16- 2023న హాత్ సే హాత్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ను నాడు సీఎల్పీ నాయకులుగా పాదయాత్ర ప్రారంభించిన భట్టి విక్రమార్క.. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 1364 కిలోమీటర్లు, 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాలు, 700 గ్రామాలకు పైగా 109 రోజుల పాటు అలుపెరగని పాదయాత్ర చేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
నేడు సుప్రీంకోర్టులో కవిత చాలెంజ్ పిటిషన్..
* ప్రకాశం : ఇవాళ సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ లో చేరనున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి..
* బాపట్ల : పర్చూరులో వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో పాల్గొననున్న వైసీపీ ఇంచార్జీ యడం బాలాజీ, జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ రావు, బాపట్ల జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి..
* ప్రకాశం : ఒంగోలు సీవీయన్ రీడింగ్ రూం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్..
* తిరుమల: ఇవాళ మంత్రాలయం ఆలయానికి టీటీడీ తరపున పట్టువస్ర్తాలు సమర్పణ
* తిరుమల: ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ వెలుపడే అవకాశం.. ఇవాళ్టి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ.
* ప్రకాశం : సింగరాయకొండ మండలం సోమరాజుపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్..
* కాకినాడ: నేడు అన్నవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
* కాకినాడ: కిర్లంపూడిలో ఉదయం 9 గంటలకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ప్రెస్ మీట్
* నెల్లూరు జిల్లా: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించనున్న అధికారులు.. వివిధ సంఘాల ప్రతినిధులు
* నెల్లూరు: కలిగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో విజయ సంకల్ప యాత్ర నిర్వహించనున్న ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి.. ఆత్మకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించనున్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
* నెల్లూరులోని కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ హరి నారాయణన్ సమావేశం
* అనంతపురం : గుంతకల్ పట్టణం ధర్మవరం గేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నూతన నిర్మాణానికి భూమి పూజ.
* అనంతపురం : శింగనమల మండలం మరవకొమ్మ వద్ద చెరువు లోకలైజైషన్ నియోజకవర్గంలోని 45 చెరువులకు నీటి కేటాయించినదుకు గుర్తుగా రైతులు నిర్మించిన స్థూపమును ప్రారంభించనున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
* శ్రీసత్యసాయి : పరిటాల శ్రీరామ్ కు టిక్కెట్ కేటాయించాలంటూ ధర్మవరం పట్టణంలో కళాజ్యోతి సర్కిల్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్న తెదేపా కార్యకర్తలు.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటన వివరాలు.. ఉదయం 9:30 గంటలకు రాజమండ్రి రూరల్ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం.. బొమ్మూరు సెంటెన్స్ స్కూల్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయం.. అనంతరం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు
* తిరుమల: ఎల్లుండి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారికి టీటీడీ తరపున పట్టు వస్ర్తాలు సమర్పణ
* పల్నాడు: రేపు బొప్పూడిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన.. చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ప్రజాగళం పేరుతో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ.. హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..
* తిరుమల: 20వ తేదీ నుండి ఐదు రోజులు పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. ఐదు రోజులు పాటు సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసీన టీటీడీ
* తిరుమల: ఎల్లుండి నుంచి 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో దర్శన టిక్కేట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ.. జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ.
* తిరుపతి: నేడు శ్రీకాళహస్తీలో టీడీపీ నేత ఎస్‌సీవీ నాయుడు తన అనుచరులు కీలక సమావేశం… బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న scv నాయుడు
* విశాఖ: నేడు విశాఖ పర్యటనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ – వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రేవంత్.. నేడు సేవ్ వైజాగ్ – సేవ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ విడుదల.
* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి నేడు 429 వ జన్మదిన వేడుకలు.. స్వామి వారి మూలబృందావనంకు తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు.. స్వామివారి బంగారు ప్రతిమను స్వర్ణ రథంపై ప్రాకారం చుట్టూ ఉరేగింపు.
* కర్నూలు: నేడు కోసిగిలో టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు మనసును మార్చాలని, టీడీపీ టికెట్ తిక్కారెడ్డికి ఇవ్వాలని కోసిగి ఎల్లమ్మ కు 1001 టెంకాయలు కొట్టునున్న టిడిపి శ్రేణులు.. ఆత్మీయ సమ్మేళనం.
* తిరుమల: 18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,322 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 24,672 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు
* కర్నూలు: నేడు పత్తికొండ (మం) పులికొండలో శ్రీ శ్రీ రంగనాథ స్వామి కళ్యాణోత్సవం, బలిహరణ.. సాయంత్రం 5 గంటలకు రథోత్సవం.