ఈ సారి రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరు అనేదానిపై ఉత్కంఠ వీడింది. రాజోలు అభ్యర్థిగా.. మాజీ ఐఎఎస్ దేవ వరప్రసాద్‌ను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ ను ప్రకటించడంతో రాజోలు ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.
మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌తో నాకు ఎటువంటి సంబంధాలు లేవు అని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్.. పట్టాభిపై, పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని నేను ముందే చెప్పాను.. నాకు వంశీ, కొడాలితో సత్సంబంధాలే ఉంటే నేను ఎందుకు చెబుతాను? అని ప్రశ్నించారు. వంశీ, నానితో సంబంధంలేదని నా పిల్లల మీద ప్రమాణాలు చేసి చెబుతున్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.