Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరిగింది.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.. సీఐడీ తరపున రంజిత్ కుమార్ వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు కొనసాగించారు.. అయితే, బెయిల్ షరతులను చంద్రబాబు ఉల్లంఘించారని సీఐడీ పేర్కొంది.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారుల లిస్ట్ మా వద్ద ఉందని నారా లోకేష్ అధికారులను బెదిరించారని.. లోకేష్ కొన్ని టీవీ చానల్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఇదే మాట్లాడారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు..
Read Also: Delhi Crime: ఢిల్లీలో దారుణం.. బైక్ పై వెళ్తున్న ఏఎస్సైపై ఓ వ్యక్తి కాల్పులు
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
అయితే, బెయిల్ వచ్చింది చంద్రబాబుకు అయితే.. కొడుకు మాట్లాడితే ఉల్లంఘన ఎలా అవుతుంది అని వాదించారు సిద్ధార్థ్ లూథ్రా.. ఈ కేసు విచారణ జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ బెంచ్ ముందు సాగింది.. అయితే, బెయిల్ షరతులు ఉల్లంగించవద్దని ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై అభియోగాలు మోపిన సీఐడీ.. ఆయన్ను అరెస్ట్ చేసింది.. ఆయన 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో గడిపారు.. ఆ తర్వాత చంద్రబాబుకు మొదట ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.. కొన్ని రోజుల తర్వాత రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం విదితమే.. దీంతో, ఏపీ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ సీఐడీ.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!