Shiromundanam Case: శిరోముండనం కేసులో సంచలన తీర్పు.. తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiromundanam Case: అప్పట్లో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో కీలక తీర్పు వెలువరించింది కోర్టు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా 9 మందికి శిక్షలు ఖరారు చేసింది.. అట్రాసిటీ కేసులో ఒక్కొక్కరికి 18 నెలలు.. ఐపీసీ సెక్షన్‌లో 6 నెలల చొప్పున శిక్ష ఖరారు చేయడంతో పాటు లక్షా 50 వేల రూపాయల ఫైన్ విధించింది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు.. అయితే, న్యాయమూర్తి ఆదేశాల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.. జిల్లా కోర్టు దగ్గర వాహనంతో పాటు మోహరించారు పోలీసులు.. బెయిల్ నిరాకరిస్తే ఎమ్మెల్సీ త్రిమూర్తులు సహా ముద్దాయిలను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించే అవకాశం ఉంది..
కాగా, 1996 డిసెంబర్ 29.. రామచంద్రాపురం మండలం వెంకటాయ పాలెంలో దళితయువకులకు ఘోర అవమానం జరిగింది. ఎన్నికల కారణాలతో ఐదుగురు దళిత యువకులను చిత్రహింసలు పెట్టారు. అందులో ఇద్దరికి గుండుకొట్టించి, కనుబొమ్మలు గీయించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్రకలకలం రేపింది. బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్దఎత్తున ఉద్యమించాయి. దీంతో ఈకేసుపై 27 ఏళ్లుగా విచారణ జరిగింది. బాధితుల్లో వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు.. మిగతా నలుగురు తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు.. ఈఘటనలో మొత్తం 24 మంది సాక్షులుగా గుర్తించారు.. వారిలో 11 మంది మృతి చెందారు.. ఇక ఈకేసులో ఆరుగురు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు. 1997 జనవరి ఒకటిన కేసుకు సంబంధించి క్రైమ్ నెంబర్ 1/1997గా ఎఫ్ఐఆర్ నమోదయింది.. ద్రాక్షారామ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. కేసుని ఫిబ్రవరి 2008న రీఓపెన్ చేశారు.. అయితే, 1994 సార్వత్రిక ఎన్నికల్లో తోట త్రిమూర్తులు ఇండిపెండెంట్‌గా రామచంద్రపురం నుంచి పోటీ చేసి గెలిచారు.. ఆ ఎన్నికల్లో ఆయన గంట గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు.. ప్రస్తుతం బాధితుల్లో ముగ్గురు ఆ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోలింగ్ ఏజెంట్ లు గా పని చేశారు. త్రిమూర్తులు వర్గం రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని దాంతో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని కోర్టుకు తెలిపారు బాధితులు..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
పొలం చుట్టూ ఫెన్సింగ్ ధ్వంసం , ఈవ్ టీజింగ్ కేసులను అక్రమంగా బనాయించి గ్రామస్తుల మధ్యలో ఘోరంగా అవమానించారని కోర్టుకు తెలిపారు బాధితులు… తోట త్రిమూర్తులు మాత్రం గ్రామ పెద్దల మధ్య జరిగిన పంచాయతీ అని తనకు సంబంధం లేదని చెప్తూ వస్తున్నారు. ఈ కేసు విచారణ హైకోర్టు వరకు వెళ్ళింది.. బాధితులు దళితులు కాదని కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని కొన్నాళ్ళు చర్చ జరిగింది.. కుల ధ్రువీకరణ పత్రం పై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ ను కూడా ఆదేశించారు. అయితే ఆరు నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.. ఈనెల మూడు వరకు ఇరుపక్షాల వాదనలు విన్న విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు బెంచ్ సమగ్రంగా వివరాలు తీసుకుంది.. తోట త్రిమూర్తులతో పాటు మిగిలిన వారికి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!