CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ పాలసీల రూపకల్పనపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వివిధ పాలసీలపై వరుసగా రెండో రోజున సీఎం చంద్రబాబు సమీక్షలు జరపనున్నారు.. మద్యం, ఇసుక పాలసీలను ఇప్పటికే అమలు చేస్తోన్న ప్రభుత్వం. రీచుల్లో తవ్వకాలను అనుమతించాలని ఇటీవలే ఇసుక పాలసీలో మార్పులు చేసింది.. ఇక, ఏపీలో మైనింగ్ పాలసీపై తుది కసరత్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానామా..? లేక క్వారీల వేలం వేసే విధానామా..? అనే అంశంపై మైనింగ్ పాలసీ విషయంలో తర్జన భర్జన పడుతోంది..
Read Also: World Students Day 2024: నేడు ప్రపంచ విద్యార్థి దినోత్సవం.. అబ్దుల్ కలాం జయంతి రోజునే ఎందుకు..?
ఇక, ఈ రోజు సాయంత్రం ఏపీ ఆర్థిక పరిస్థితిపై సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు. బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై సమీక్షలో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.. ఆదాయార్జన శాఖలను మరింత మెరుగుపరిచి ఏ విధంగా ఆదాయం సముపార్జించాలనే అంశంపై చర్చించనున్నారు ఏపీ సీఎం.. కేంద్ర పథకాలకు యూసీల చెల్లింపులు ఏ మేరకు జరుగుతున్నాయనే అంశంపై ఆరా తీయనున్నారు చంద్రబాబు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో ఏమైనా పెండింగ్ ఉన్నాయా..? ఉంటే వాటిని ఏ విధంగా తీసుకు రావాలనే అంశంపై ఈ సమావేశంలో సమీక్షించబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, నిన్నటినిన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలు, ఆయా రంగాల్లో ఉన్న నిపుణులతో చర్చించి కొత్త పాలసీలు రూపొందించినట్లు వివరించారు. ఎలక్ట్రానిక్స్ పాలసీపై చర్చించిన ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే క్యాబినెట్ లో ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా ఐటీ పాలసీ, డ్రోన్ పాలసీపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. వీటిని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఈనెల 22, 23వ తేదీల్లో తలపెట్టిన అమరావతి డ్రోన్ సమ్మిట్ పై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ భాగస్వామ్యంతో ఎపి డ్రోన్ కార్పొరేషన్ ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోన్న విషయం విదితమే.