వైయస్సార్ పేరు లేకుండా చేస్తున్న ఇలాంటి వారా? వైఎస్సార్ వారసులు? అంటూ పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్.. కడపలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ మరణానంతరం ఆయన పేరును చార్జిషీట్లో పెట్టిన పార్టీ.. నన్ను 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీ.. చార్జిషీట్ లో మనమే ఆ పేరు పెట్టించామట.. ఎంతటి దుర్మార్గంగా ఆరోపణలు చేస్తున్నారో చూడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును లబ్దిదారాల ఖాతాల్లో ప్రభుత్వం డీబీటీ ద్వారా నగదు జమ చేయటంపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది... ఈ నెల 14వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసుకోవచ్చని గతంలో ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఆదేశాలను కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు అన్నీ ఆగిపోతాయని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఈ 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేశామని.. హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలుపెట్టామన్నారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో డీబీటీ పథకాల అమలుపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది.. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే బటన్ నొక్కి వివిధ పథకాలకు నిధులు విడుదల చేశారన్న ఎన్నికల కమిషన్.. రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లాల్సిన నిధులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేరలేదని పేర్కొంది.. లబ్ధిదారుల ఖాతాలకు నిధుల జమలో జరిగిన జాప్యంపై వివరణతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది..