Minister Satya Kumar Yadav: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందే దీపావళి వచ్చింది.. ఐదేళ్ల రాక్షస పాలనకు స్వస్తి పలికి.. ప్రజలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి చారిత్రాత్మిక విజయం అందించారని తెలిపారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్.. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ కి ఘన స్వాగతం పలికారు నాయకులు, కార్యకర్తలు.. భారీ ఎత్తున తరలివచ్చి నియోజవర్గ పరిధిలోకి విచ్చేసిన సత్య కుమార్ యాదవ్ కి అడుగడుగునా నీరాజనాలు పడుతూ పూలమాలలతో సత్కరించుకుంటూ రోడ్డు పొడవునా స్వాగతం పలికారు. మంత్రి బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా ధర్మవరంలో అడుగు పెడుతున్న సందర్భంగా కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున బైక్ ర్యాలీగా వెళ్లి సత్య కుమార్ యాదవ్ కి స్వాగతం పలికారు..
Read Also: Prof. Kodandaram: పోలవరం పూర్తి అయితే.. భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుంది..!
ఇక, ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం తిరుగోమనంలో పయనించి.. 20 ఏళ్లు వెనక్కు వెళ్లింది.. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, సహజ వనరులు దోచుకున్నారని ఆరోపించారు.. గత పాలకులు ఏపీకి అస్తిత్వం లేకుండా చేశారు.. చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతామన్నారు.. చాలా పెద్ద బాధ్యతలు ప్రజలు మా పై ఉంచారు.. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఏపీని అగ్రగామిలో ఉంచుతాం అన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.