ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ్టితో ప్రచారానికి తెరపడనుంది.. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో మినహా శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. కాగా, నాల్గో విడత ఎన్నికలకు గత నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది.. ఇక, ప్రచారంతో అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి.. చివరి రోజు కూడా ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు.. వైసీపీ, టీడీపీ, జనసేన చీఫ్లు ప్రచారంలో పాల్గొననున్నారు..
తెలుగు న్యూస్ ఛానెళ్ల చరిత్రలోనే తొలిసారిగా ప్రధాని మోడీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తోంది ఎన్టీవీ.. తన మనసులోని మాటను మోడీ ఎన్టీవీతో పంచుకున్నారు.. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి.. తెలంగాణలో బీజేపీ హవా కొనసాగుతుందా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ రాజకీయాలకు సంబంధించిన ఎన్నో అంశాలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ..