-
Shakti App: “శక్తి”యాప్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. ఎలా పనిచేస్తుందంటే..?
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల భద్రతకై కొత్త యాప్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ పోలీస్ శాఖ రూపొందించిన "శక్తి" యాప్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన ఆయన.. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ రూపొందించిన 'శక్తి' యాప్ ను ప్రారంభించారు.. చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేలా చేనేత రథాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని కూడా ఆవిష్కరించారు ఏపీ సీఎం. -
Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Top Headlines, Andhra Pradesh, cinema, international, national, sports news, Telangana, India, Top Headlines @ 5 PM -
Posani Krishna Murali: పోసానికి మరో షాక్.. 20వ తేదీ వరకు రిమాండ్
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. పోసానికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది విజయవాడలోని సీఎంఎం కోర్టు.. ఈ రో సీఎంఎం కోర్టులో పోసానిని హాజరు పరిచారు పోలీసులు.. అయితే, తనపై అక్రమంగా కేసులు పెట్టారని న్యాయాధికారికి చెప్పారు పోసాని.. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు.. -
CM Chandrababu: ఆడబిడ్డల భద్రత కోసం ప్రత్యేకంగా యాప్.. వారి జోలికొస్తే అదే మీకు చివరి రోజు..!
ఆడబిడ్డల భద్రత కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకువచ్చాం.. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. అదే మీకు చివరి రోజు అవుతుంది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ఇంటరాక్షన్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నా కుటుంబంతో పాటు వ్యాపారంలో భువనేశ్వరి పాత్ర కీలకం. హెరిటేజ్ సంస్థని భువనేశ్వరి డెవలప్ చేశారని ప్రశంసలు కురిపించారు.. ఇక, నా తల్లి పడిన ఇబ్బందులు మహిళలు పడకూడదనే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశానని… -
RK Roja: చంద్రబాబు, పవన్‌పై రోజా ఫైర్.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదు..!
సూపర్ సిక్స్ పేరుతో మహిళలను నట్టేట ముంచారు.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదంటూ కూటమి ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఏపీలో చంద్రన్న దగ, చంద్రన్న పగ, చంద్రన్న పంగనామం, చంద్రన్న వెన్నుపోటు మాత్రమే అమలవుతున్నాయన్న ఆమె.. చంద్రబాబు మోసాలపై ఏపీ మహిళలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. రోజుకు 70 మంది మహిళలు, వృద్ధుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. -
YS Viveka Murder Case: వాచ్మెన్ రంగన్న మృతిపై సిట్ ఏర్పాటు.. రేపు రీపోస్టుమార్టం..!
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి, వాచ్మెన్ రంగన్న మృతి పై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రంగన్న మృతి గల కారణాలను సమగ్రంగా విచారించడం కోసం కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
Off The Record: ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి వర్సెస్ సరితా తిరుపతయ్య.. గద్వాల పంచాయితీ గాంధీ భవన్ చేరిందా..?
నడిగడ్డ ప్రాంతంగా పిలుచుకునే గద్వాల రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. జెండాలు, అజెండాలు మారిపోయినా, ప్రభుత్వాలు మారినా గద్వాల పాలిటిక్స్‌లో వేడి మాత్రం తగ్గదు. ఇలాంటి వాతావరణంలో తాజాగా మారుతున్న పరిణామాలతో గద్వాల పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న సరితా తిరుపతయ్య కారు దిగి కాంగ్రెస్ లో చేరిపోయారు. గద్వాల ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని బరిలో నిలిచిన సరిత, బిఆర్ఎస్ అభ్యర్ది క్రిష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. -
Vangalapudi Anitha: వైఎస్ వివేక హత్య కేసులో హోం మంత్రి కీలక వ్యాఖ్యలు.. తలకిందులుగా తపస్సు చేసినా విడిచిపెట్టం..!
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడో మరోసారి తెరపైకి వచ్చింది.. ఈ కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై విచారణ చేస్తామన్న ఆమె.. సాక్షుల వరుస మరణాల అంశంపై కేబినెట్లో చర్చించాం సమగ్ర దర్యాప్తు జరపాలని అదేశించాం అన్నారు.. -
Off The Record: ఆ మాజీ మంత్రులను టీడీపీ ఇక చాలు అనుకుంటుందా..?
2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో ఊహించని విధంగా సీట్లు సంపాదించుకున్న ఇద్దరు నాయకులు ఎమ్మెల్యేలవడమేకాదు...నాటి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులు కూడా అయ్యారు. అందులో ఒకరు చింతలపూడి నుంచి పీతల సుజాత కాగా... మరొకరు కొవ్వూరు నుంచి కె ఎస్ జవహర్. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే... సుజాత గనుల శాఖ మంత్రిగా అవకాశాన్ని దక్కించుకోగా... -
Minister Satya Kumar Yadav: వైద్య, ఆరోగ్య శాఖకు రూ.19,264 కోట్లు.. గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.19,264 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. గిరిజన ప్రాంతాల్లో ఒక్కొక్కటీ రూ. 50 కోట్ల వ్యయంతో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్ని నిర్మిస్తున్నామని సత్యకుమార్ యాదవ్ శాసనసభకు వివరించారు. రూ. 19,264 కోట్లు బడ్జెట్ గ్రాంట్ ను మంజూరు చేసినందుకు శాసనసభకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానని మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!