Aamir Khan Third Marriage: ఆమిర్ ఖాన్ 3వ భార్య ఈమెనే! ఆమె ఏం చేస్తుందో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aamir KhanThird Marriage: బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ జీవితంలో జూలై 5 (ఈరోజు) చాలా ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోనుంది. 59 ఏళ్ల ఆమిర్ ఖాన్ ఈరోజు తన లాంగ్ టైమ్ గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్‌ను మూడో వివాహం చేసుకోబోతున్నారు. ముంబైలోని ఆమిర్ నివాసంలో అత్యంత నిరాడంబరంగా, సన్నిహితుల సమక్షంలో ఈ మ్యారేజ్ జరగనుంది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన సుమారు 150 మంది అతిథులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఆమిర్ ముగ్గురు పిల్లలు కూడా ఈ పెళ్లిలో భాగం కావడం విశేషం.
ఎవరీ గౌరీ స్ప్రాట్..
లైమ్‌లైట్‌కు దూరంగా ఉండే గౌరీ స్ప్రాట్ బ్యాక్‌గ్రౌండ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆమె తల్లి తమిళురాలు కాగా, తండ్రి ఐరిష్ వ్యక్తి. పలు నివేదికల ప్రకారం.. గౌరీ తాతగారు భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు. ఉన్నత విద్యావంతురాలైన గౌరీ, లండన్‌లోని ‘యూనివర్శిటీ ఆఫ్ ది ఆర్ట్స్’ నుంచి ఫ్యాషన్, స్టైలింగ్, ఫోటోగ్రఫీలో ఎఫ్‌డిఎ (FDA) డిగ్రీ పూర్తి చేశారు. వృత్తిరీత్యా ఆమె ప్రొఫెషనల్ హెయిర్‌డ్రెస్సర్. ప్రస్తుతం ఆమె ‘ఆమిర్ ఖాన్ ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read
25 ఏళ్ల పరిచయం..
వ్యక్తిగత జీవితంలో గౌరీకి ఇదివరకే వివాహమై విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కాగా, ఆమిర్ ఖాన్‌కు, గౌరీకి 25 ఏళ్లుగా పరిచయం ఉంది. గతేడాది (2025) తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఆమిర్ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు. ఏడాదిన్నర క్రితం మళ్లీ కలిసిన తాము, ఇప్పుడు పెళ్లి పీటలెక్కుతున్నట్లు స్పష్టం చేశారు. ఆమిర్‌కు గతంలో రీనా దత్తా, కిరణ్ రావులతో వివాహం జరిగి విడాకులతో ముగిసిన సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత కూడా ఆమిర్ తన ఇద్దరు మాజీ భార్యలతో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
-
Ramayana-Yash: రావణుడిగా విశ్వరూపం.. ‘రామాయణ’ పార్ట్-1లో యశ్ స్క్రీన్ టైమ్ అంతనా?
-
Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!