Ali Khamenei Funeral: అగ్రరాజ్యానికి కాలం మూడిందా? ఖమేనీ మరణానికి ఇరాన్ ‘ఇంతకామ్’ తీర్చుకోబోతుందా!
- ఖమేనీ అంతిమ యాత్రతో మారిన గ్లోబల్ పాలిటిక్స్..
- అమెరికాపై భీకర ప్రతీకారానికి 'రెడ్ అలర్ట్'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ali Khamenei Funeral: పర్షియా (ఫారస్) సామ్రాజ్య వైభవాన్ని అణచివేయాలని ఏ శక్తులు ప్రయత్నించినా, ఆ బూడిద నుంచే ఒక కొత్త అగ్నిపర్వతం బద్దలవుతుందని ఇరాన్ మత పెద్దలు చెబుతున్నారు. ఇప్పుడు ఇరాన్ రాజధాని తేహ్రాన్‌లో కనిపిస్తున్న జనసంద్రం కేవలం సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమ యాత్ర చిత్రం మాత్రమే కాదని.. ఇది అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఒక ‘సైలెంట్ వార్ రూమ్’ రెడీ అవుతుందనే దానికి బలమైన సంకేతం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తాము ఇరాన్‌కు అంత్యక్రియల కోసం ‘ఒక వారం గడువు’ ఇచ్చామని ప్రకటిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో మాత్రం సరికొత్త యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఖమేనీ మరణంతో ఇరాన్ ఇప్పుడు రగిలిపోతోంది. ఈ తబాహీకి (విధ్వంసానికి) ప్రతీకారం తీర్చుకునేందుకు ఏ క్షణమైనా ఇరాన్ యుద్ధ శంఖం పూరించే అవకాశం ఉందని, అదే జరిగితే అరబ్ దేశాల భూగోళమే మారిపోవడం ఖాయం అని చెబుతున్నారు.
తేహ్రాన్ వీధుల్లో కన్నీరు..
అయతుల్లా అలీ ఖమేనీ అంతిమ యాత్ర రోజున ఇరాన్ రాజధాని తేహ్రాన్ గాలిలో ఒక యుగం అంతమైన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రజల చేతుల్లో కనిపించిన ఆ ‘రెడ్ ఫ్లాగ్స్’ (ఎర్ర జెండాలు) కేవలం బట్ట ముక్కలు కావని, అవి భీకర ప్రతీకారానికి బహిరంగ ప్రకటనలు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ ఇక న్యాయం కోసం యాచించదు, నేరుగా లెక్క తేలుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్‌ను అంతమొందిస్తే దేశం ముక్కలవుతుందనే ట్రంప్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఖమేనీ భౌతికంగా దూరమైనా, ఇరాన్ ప్రజల నరనరాల్లో ప్రతీకార ఇంధనాన్ని నింపి వెళ్లారని అంటున్నారు. ఆకాశాన్ని తాకుతున్న ‘డెత్ టు అమెరికా’ నినాదాలు కేవలం పదాలు కావని, బద్దలవడానికి సిద్ధంగా ఉన్న ప్రతీకారం అని చెబుతున్నారు.
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
అయతుల్లా అలీ ఖమేనీ పార్థివ దేహాన్ని జూలై 4 నుంచి 6 వరకు తేహ్రాన్‌లోని ముసల్లాలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. తర్వాత హుస్సేన్ స్క్వేర్ నుంచి ఆజాదీ స్క్వేర్ వరకు భారీ అంతిమ యాత్ర సాగనుంది. జూలై 7న ఇక్కడి నుంచి 150 కి.మీ దూరంలోని పవిత్ర నగరం ‘కుమ్’ కు శవాన్ని తరలించి అక్కడ ప్రత్యేక శోకసభ నిర్వహిస్తారు. అనంతరం జూలై 8న కుమ్ నుంచి వైమానిక మార్గంలో 600 కి.మీ దూరంలోని ఇరాక్ పవిత్ర స్థలాలు నజఫ్, కర్బలాలకు తరలించి శ్రద్ధాంజలి ఘటిస్తారు. చివరగా జూలై 9న ఇరాన్‌లోని మషద్ నగరానికి తరలించి, ప్రముఖ ‘ఇమామ్ రజా దర్గా’లో ఖమేనీ భౌతికకాయాన్ని సుపుర్ద్-ఎ-ఖాక్ (ఖననం) చేయనున్నారు.
అమెరికాపై ఇరాన్ యుద్ధానికి దారితీసే 7 ముఖ్య కారణాలు
ఖమేనీ అంతిమ సంస్కారాల తర్వాత ఇరాన్ అధికారికంగా యుద్ధం ప్రకటించే అవకాశం ఉందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు గల ప్రధాన కారణాలు ఇవే..
* సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం.
* అమెరికా దాడుల్లో ఇరాన్‌కు చెందిన 3,000 మందికి పైగా పౌరులు, సైనికులు మరణించడం.
* ఇరాన్‌పై అమెరికా సుదీర్ఘకాలంగా విధిస్తున్న కఠినమైన ఆంక్షలు.
* ఇరాన్ యురేనియం సుసంపన్నతపై అంతర్జాతీయంగా నిషేధాలు విధించడం.
* దేశ మిసైల్ ప్రోగ్రామ్‌ను అణచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు.
* వ్యూహాత్మక ‘హోర్ముజ్ జలసంధి’పై పట్టు సాధించేందుకు అమెరికా చేస్తున్న కుట్రలు.
* ఇరాన్ ప్రధాన ఆర్థిక వనరు అయిన ఎనర్జీ (ఆయిల్) సెక్టార్‌పై నిరంతర దాడులు.
ట్రంప్ భ్రమలు బద్దలు..
ఖమేనీ మరణానంతరం ఇరాన్లో అంతర్గత తిరుగుబాటు జరిగి, రాజకీయ మార్పు జరుగుతుందని ట్రంప్, నెతన్యాహు భావించారు. కానీ, తేహ్రాన్ వీధుల్లోకి వచ్చిన 2 కోట్ల మంది జనసందోహం వారి భ్రమలను పటాపంచలు చేసింది. ఖమేనీ శహాదత్ (రక్తసాక్ష్యం) ఇరాన్‌ను మరింత ఏకం చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు అమెరికా షరతులపై ఇరాన్ ప్రభుత్వంలో రెండు భిన్నమైన అభిప్రాయాలు (సాఫ్ట్ & హార్డ్ లైన్) ఉండేవి. కానీ ప్రస్తుత ఉద్రిక్తతలు, ప్రజా ఆగ్రహం చూస్తుంటే ఇరు వర్గాలు ఏకతాటిపైకి వచ్చి అమెరికాపై నేరుగా యుద్ధం ప్రకటించే దిశగా అడుగులు పడుతున్నాయని చెబుతున్నారు. ఆఖరి శ్వాస వరకు అమెరికాకు లొంగని ఖమేనీ ఆశయాలను నెరవేరుస్తామని, ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యంతో పాటు సామాన్య ప్రజలు సైతం శపథం చేస్తున్నారని అంటున్నారు. పెంటగాన్ వర్గాల్లో సైతం ఈ నిశ్శబ్దం ఏ పెద్ద తుఫానుకు దారితీస్తుందోనన్న ఆందోళన మొదలైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!