AP Government: అనకాపల్లి ఘటనతో ప్రభుత్వం అలర్ట్.. సీఎం కీలక ఆదేశాలు..
- అనకాపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనతో ప్రభుత్వం అలర్ట్..
- రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ.. ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలు.. హాస్టళ్లను తనిఖీ చేయాలి..
- జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు అదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: అనకాపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు అదేశాలు జారీ చేశారు.. హాస్టళ్లు, సంక్షేమ సంస్థలు నడిపేందుకు అనుమతులు ఉన్నాయా? లేదో? చూడాలని కలెక్టర్లకు సూచించారు సీఎం.. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న భవనాలు సురక్షితమా కాదా అన్న కోణంలోనూ తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.. బాలలు ఉన్న చోట పారిశుద్ధ్యం, పరిసరాల శుభ్రత, ఆరోగ్యకరమైన పరిస్థితుల ఉన్నాయో లేదో చూడాలని పేర్కొన్నారు.. సంబధిత విభాగాలు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.
Read Also: Hema Committee report: నటి భావన లైంగిక వేధింపుల కేసు..మలయాళ సినీ ఇండస్ట్రీపై సంచలన రిపోర్ట్..
Also Read
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
కాగా, కలుషిత ఆహారం కాటేసిన ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులకు తీరని వేదనను మిగిల్చిన ఈ దారుణం అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కొన్నేళ్లుగా పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ నడుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని గిరిజన గ్రామాలకు చెందిన 90 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు. మతపరమైన కార్యకలాపాలు నిర్వహించే కిరణ్ కుమార్ ఈ ట్రస్ట్ చైర్మన్. కనీస వసతులు లేని రేకుల షెడ్ లో నడుస్తున్న ఈ హాస్టల్లో విద్యార్థులు శనివారం సాయంత్రం కలుషిత ఆహారం తిన్నారు. పునుగుల కూర, సమోసా, బిర్యానీ వంటి ఫుడ్ తినగా పిల్లల్లో డయేరియా లక్షణాలు కనిపించాయి. మొదట స్వస్థత గురైన ఒకర్ని కోటవురట్ల ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.
Read Also: Pakistan: వరదలతో పాకిస్తాన్ అతలాకుతలం.. 209కి చేరిన మృతుల సంఖ్య..
ఈ క్రమంలో బాధితుల సంఖ్య పెరగడం, చిన్నారులు ఆరోగ్యం విషయంగా మారుతుందని పసిగట్టిన కిరణ్… కుటుంబ సభ్యులను పిలిపించి పిల్లలను వారి వెంట పంపించేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా తల్లిదండ్రులు, బంధువులు ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో తీవ్ర స్వస్థత కారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పిల్లలు చేరడంతో అల్లూరి జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. అప్పటికే ముగ్గురు మరణించారు. అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో అనకాపల్లి జిల్లా అధికార యంత్రం హుటాహుటిన బాధిత విద్యార్థులను నర్సీపట్నం ఆస్పత్రికి తరలించింది. మెరుగైన వైద్య కోసం 14 మందిని విశాఖ kgh కు తరలించారు. వీరిలో ఒక పాప మినహా మిగినలిన వాళ్ళందరూ ఆరోగ్యం స్టేబుల్ గా ఉందని హోం మంత్రి అనిత చెప్పారు. ఇళ్లలో ఉన్న మిగిలిన పిల్లలకు వైద్య సేవలు అందుబాటులో తీసుకురాగా… ఈ ఘటనకు బాధ్యుడైన కిరణ్ పై కేసులు నమోదు చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు