Sudden Rains: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ సృష్టించిన విధ్వంసంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.. జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో పడిపోయింది ప్రభుత్వం.. అయితే, మరోసారి రాష్ట్రానికి వర్ష సూచన వచ్చింది.. రేపు రాష్ట్రంలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు. Read Also: Chromebook: రూ.12,499 కి ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్.. […]
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి ఇచ్చింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ కు అనుమతి ఇస్తూ 111, 126 జీవోలు ఇప్పటికే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, కోర్టు అనుమతి ఇవ్వాలని సిట్ వేసిన పిటిషన్‌కు అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు.. ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వటంతో […]
MLA Lokam Naga Madhavi: మొంథా తుఫాన్ విషయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నా.. భారీగానే నష్టం వాటిల్లింది.. అయితే, ఏ ఒక్క తుఫాన్ బాధితుడికి నష్టం జరగకుండా చూడాలని.. ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి సాయం అందాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తున్నా.. కింది స్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది అనిపించేలా కొన్ని ఘటనలు కనపిస్తున్నాయి.. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం జనసేనా ఎమ్మెల్యే లోకం నాగమాధవికి మత్స్యకారులు చుక్కలు చూపించారు. తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న […]
CM Chandrababu: రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రతి 15 రోజులకు రాజధాని పై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.. కొన్ని సంస్థలు.. వర్క్ ఫోర్స్.. మెషినరీ.. పూర్తి స్థాయిలో కేటాయించలేదన్నారు.. ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగు పరుచుకోవలని సూచించారు.. ఇక, రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. త్వరలో రాజధాని రైతులతో […]
Deputy CM Pawan Kalyan: మొంథా తుఫాన్‌తో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తుఫాన్ సహాయక చర్యలపై కాకినాడ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహాయం పునరావాస కార్యక్రమాలు చేపట్టడంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.. నిత్యావసర వస్తువులు నగదు పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలి.. నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది.. […]
AP Crime: విశాఖపట్నంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.. మృతుడు సాయి తేజ.. ఎంవీపీలోని సమత కాలేజ్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.. ఈ రోజు ఉదయం విద్యార్థి సాయి తేజ ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు.. విద్యార్థి సాయి తేజ మృతికి కాలేజీ లెక్చరర్ లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.. గత కొద్దిరోజుల నుంచి వేధింపులు ఎక్కువ […]
AP Crime: టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అమాయకులను మోసం చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.. తాజాగా, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఫోటోను తమ వాట్సాప్ డీపీగా పెట్టుకుని.. తాము ఎన్.ఆర్.ఐ.లమని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేసింది సీఐడీ.. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న సాయి శ్రీనాథ్ (గచ్చిబౌలి, హైదరాబాద్), సుమంత్ (పఠాన్ చెరువు) లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. […]
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట్లో కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధినాయకత్వం. పార్టీ నాయకుడు, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ప్రకటించింది. ఎల్లుండి సీఎం రేవ్ంత్ రెడ్డి టీమ్‌లో చేరబోతున్నారు అజార్. తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా మూడు ఖాళీలు ఉండగా… అందులో ఒకదాన్ని అజార్‌కు క్లియర్ చేశారు. మిగతా రెండిటిని డిసెంబర్లో భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అజార్. […]
Off The Record: పెనమలూరు పేచీలు కృష్ణా జిల్లా వైసీపీని కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధినాయకత్వం తీసుకున్న ఓ నిర్ణయం నియోజకవర్గంలో వర్గపోరుకు బీజం వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఎవరో వస్తారని అంచనా వేస్తున్న ఓ వర్గం… ఇప్పుడున్న ఇన్ఛార్జ్కి సహాయ నిరాకరణ మొదలుపెట్టేసిందట. దీంతో కొత్త గొడవలు మొదలవుతున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత మంత్రి పార్థసారధి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. కానీ…2024 ఎన్నికలకు ముందు వైసీపీని వదిలేసి […]
Off The Record: భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్….. 2019లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు దారణమైన అనుభవాన్ని మిగిల్చిన నియోజకవర్గం. అదే చోట ఈసారి… 2024లో పార్టీ అభ్యర్థి గెలిచినా… ఆ ఆనందం రోజురోజుకీ ఆవిరి అయిపోతోందట. 2024లో నేను ఎక్కడ పోటీ చేసినా…. భీమవరాన్ని మాత్రం మర్చిపోను .. అభివృద్ధి చేసి చూపిస్తానని అప్పట్లో పవన్ ఇచ్చిన హామీలకు దిక్కు లేకుండా పోతోందని అంటున్నారు. అధినేత ఆశయాలను,ఇచ్చిన మాటను పక్కన పెడుతున్న భీమవరం జనసేన నేతలు… సంపాదన మీదే శ్రద్ధ […]