Minister Lokesh Meets Indra Nooyi: పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయితో మంత్రి లోకేష్ భేటీ
- అమెరికా పర్యటనలో బిజీబిజీగా మంత్రి నారా లోకేష్..
- పెప్సికో మాజీ చైర్మన్ మరియు సీఈవో ఇంద్రా నూయితో భేటీ..
- సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు..
- వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది..
- ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Lokesh Meets Indra Nooyi: ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. పలు ప్రతిష్టాత్మక సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశాలు అవుతున్నారు.. ఏపీలో ఉన్న వనరులు.. పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరిస్తూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు.. ఇక, ఈ పర్యటనలో భాగంగా లాస్ వెగాస్ లో పెప్సికో మాజీ చైర్మన్ మరియు సీఈవో అయిన ఇంద్రా నూయితో సమావేశం అయ్యారు.. లాస్ వెగాస్ లో ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో ఈ భేటీ జరిగింది.. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తూ వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది. టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక కృషిలో భాగస్వాములు కండి. స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు మేం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునివ్వండి. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, హరిత కార్యక్రమాలు, పర్యావరణ హిత పారిశ్రామిక విధానాలు అమలుచేస్తున్న ఆంధ్రప్రదేశ్ నిబద్ధతను పారిశ్రామిక సమాజానికి చాటిచెప్పండి అంటూ పిలుపునిచ్చారు..
Read Also: Mohammed Shami: అయ్యో పాపం మహమ్మద్ షమీ.. గాయం ఎంతపని చేసే!
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ఇక, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో మేం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం.. నాయకత్వం, సాంకేతికతలో లింగ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ తరపున కార్యక్రమాలను రూపొందించండి.. లింగ వైవిధ్యం సంస్థాగత విజయాన్ని ఎలా మెరుగుపరుస్తుందో చర్చించండి అన్నారు మంత్రి లోకేష్.. వివిధ రంగాలలో మహిళలకు సాధికారత కల్పించడంపై మీ ఆలోచనలను మాతో పంచుకోండి. ప్రజారోగ్యానికి సంబంధించి ప్రత్యేకించి వెల్ నెస్ కార్యక్రమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాల్సి ఉంది. ఇందులో కార్పొరేట్, ప్రభుత్వరంగాల భాగస్వామ్యం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించండి అని కోరారు.. విద్య, సాంకేతిక ఆధారిత నైపుణ్యాల అభివృద్ధి ద్వారా యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. యువ నిపుణులు వారి కెరీర్‌లో విజయం సాధించడానికి అవసరమైన మెంటరింగ్ ప్రోగ్రామ్‌లను రూపొందించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను ప్రత్యక్షంగా చూడడానికి మా రాష్ట్రాన్నిసందర్శించండి. ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనలో మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. లోకేష్ ప్రతిపాదనలపై ఇంద్రానూయి సానుకూలంగా స్పందిస్తూ ఏపీలో పెట్టుబడుల రాబడికి తమవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు..
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!