సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.. రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించి ఓ నిర్ణయానికి వచ్చింది.. అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటుకు గతంలో పలు సంస్థలకు ప్రభుత్వం భూకేటాయింపులు చేసిన విషయం విదితమే కాగా.. ఆయా సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి కేసును కొట్టివేసింది గుంటూరు కోర్టు.. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా, రిషితేశ్వరి కేసు కొట్టేస్తున్నామని తుది తీర్పు వెలువరించింది గుంటూరు జిల్లా ఐదవ కోర్టు.. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే.
జెట్ స్పీడ్‌తో నేషనల్ హైవే ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించడంపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.. అనంతరం నేషనల్ హైవే ప్రాజెక్టుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.. NHAI, MoRTH ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు.. కాకినాడ పోర్ట్ వద్ద సముద్రంలో ప్రయాణించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రేషన్ బియ్యం పట్టుబడ్డ నౌక వద్దకు ప్రత్యేక బోట్లో వెళ్లిన పవన్.. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పరిశీలించారు.. ఈ బియ్యం ఎవరు సరఫరా చేశారని ఆరా తీశారు.. సముద్రంలో 9 నాటికల్ మైళ్ల దూరంలో పట్టుబడ్డ 640 టన్నుల బియ్యం వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించారు పవన్ కల్యాణ్ .. భారీగా బియ్యం అక్రమ…
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదట్లో బాగానే ఉన్నా... ఇటీవల వరుసగా రెండు, మూడు ఊహించని ఘటనలు జరిగాయి. లగచర్లలో రైతులు కలెక్టర్ పై తిరగబడడంతో సమస్యలు మొదలయ్యాయి. కలెక్టర్‌ని తప్పుదోవ పట్టించి రైతులు లేని దగ్గరికి తీసుకెళ్లి దాడి చేశారని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఎపిసోడ్లో బీఆర్ఎస్ నేతలు కుట్ర పూరితంగా వ్యవహరించారని, కలెక్టర్‌పై దాడికి అదే కారణం తేల్చింది సర్కార్. రెండు మూడు రోజులపాటు ఈ ఎపిసోడ్ చుట్టూనే తిరిగింది తెలంగాణ రాజకీయం మొత్తం. అది కచ్చితంగా బీఆర్ఎస్ కుట్రేనని, ఆధారాలు…
డబ్బులు ఎవరికీ ఊరికే రావు.... ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ట్యాగ్ లైన్ ఇది. సాధారణ పరిస్థితుల్లో అయితే... అది వాస్తవం కూడా. కానీ.... అక్కడ మాత్రం డబ్బులు ఊరికే వచ్చేస్తున్నాయట. జస్ట్... పనికిరాని బూడిద కుప్పల్ని క్లియర్ చేసి వేరే చోటికి తీసుకెళ్ళి అమ్ముకుంటే... లక్షలకు లక్షలు కళ్లజూడవచ్చట. ఇక వివరాల్లోకి వెళితే... సంబంధం లేకున్నా...ఈ వివాదం మొత్తానికి కేంద్ర బిందువు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్... ఆర్టీపీపీ. జమ్మలమడుగు నియోజకవర్గంలో బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్…
ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి ఆరు నెలలు కావస్తోంది. కూటమి సర్కార్ పవర్లోకి వచ్చాక... నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన, తమను ఇబ్బందులు పెట్టిన నాయకులు, ఇతరుల టార్గెట్‌గా పావులు కదులుతున్నాయన్నది ఓపెన్ సీక్రెట్. వైసీపీ ప్రభుత్వంలోఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వారితోపాటు పార్టీని భుజానికెత్తుకుని అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై ఇష్టా రీతిన మాట్లాడిన నేతలు అందరి మీద వరుస కేసులు బుక్ అవుతున్న పరిస్థితి. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదన్నట్టుగా ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు ఎన్డీఏ కూటమిలో పడటం లాంఛనమే. అయితే రాజ్యసభలో అడుగు పెట్టేది ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మూడు పార్టీల నుంచి భారీగా ఆశావహులు ఉన్నారు. ఎవరికి వారు లాబీయింగ్ మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అన్నయ్య నాగబాబును రాజ్యసభకు పంపే పనిలోపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.
డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ఈగల్‌ను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అమరావతిలో కేంద్ర కార్యాలయం... 26 జిల్లాల్లో 26 నార్కోటిక్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఉత్వర్వులు ఇచ్చింది. డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాప్తు చేయనుండగా... సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలని ఆదేశించింది. అయితే, హెడ్ ఆఫీసులో ఉద్యోగుల కాలపరిమితి మూడేళ్ల నుంచి ఐదేళ్లుగా నిర్ణయించింది. మరోవైపు.. డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు…