love Or Attraction: లవ్‌లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
- ప్రేమలో పడిపోయారా..
- నిజంగా మీది ప్రేమేనా..
- అది ప్రేమ కాదు ఆకర్షణ మాత్రమేనా..
- ఇలా చెక్ చేసుకుంటో ఏదో తెలిసిపోతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
love Or Attraction: ప్రేమికుల రోజు వచ్చిందట.. ఎంతో కాలంగా తమలో దాచుకున్న ప్రేమను.. వెల్లడించి.. కొత్త ప్రపంచంలో విహరించేందుకు.. మనసువిప్పి మాట్లాడుకునేందుకు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి.. ఇలా ఎన్నో జంటలు సిద్ధం అవుతున్నాయి.. అయితే, ప్రేమ ఒక మాయ. మనిషి తన జీవితంలో ఏ దశలోనైనా ఈ అనుభూతిని తప్పకుండా పొందేఉంటాడు. అది కొందరికి అమృతాన్ని ఇస్తే మరికొందరికి దుఃఖాన్ని మిగుల్చుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమ నిప్పులాంటిది. తేడా వస్తే, అది మిమ్మల్ని .. మీవాళ్లను సైతం దహనం చేస్తుంది. అందుకే మనసుతో ఆడుకోవడం నిప్పుతో ఆడుకున్నంత ప్రమాదకరం. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన కళ్లకు అన్నీ అందంగానే కనిపిస్తాయి. కానీ, ఎక్కడైనా చిన్న పొరపాటు చేసినప్పుడే ఎక్కడ పడిపోయామో లోతెంతో తెలుస్తుంది. అందుకే మీ మనస్సుతో పాటు మీ మనస్సులోకి వచ్చే వ్యక్తి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. ముఖం చూడగానే ప్రేమ పుడుతుంది.. రంగు చూసి.. రూపాన్ని చూసి.. కట్టు బొట్టు చూసి.. లేదా ఎదుట వ్యక్తి పట్ల.. ఓ వ్యక్తి చూపించే కేర్.. తన గురించి ఆలోచించే విధానం.. సమయానికి ఆదుకునే గుణంతోనూ.. వారిపట్ల ఆకర్షణ మొదలు కావచ్చు.. స్నేహంగా మారొచ్చు.. అదికాస్తా ప్రేమగా మారి.. ఇద్దరి మధ్య హద్దులు చెరిపేయవచ్చు.. కానీ, ఎదుటి వ్యక్తిని ఎలా చెప్పగలం అనే ప్రశ్న రావచ్చు.
Read Also: Laila Review: లైలా రివ్యూ
Also Read
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
మొహం చూసి ప్రేమలో పడి గుడ్డిగా ముందుకు సాగలేరు. ఏది కావాలో అన్నీ చూసుకుంటాం.. జీవితాంతం ఎవరితో గడపాల్సిన వారిని ఎంపిక చేసుకోవడంలో పొరపాటు చేస్తే ఫలితం మనతో పాటు మనవాళ్లు జీవితాలు. అందుకే మీ ప్రేమ, ఆకర్షణ అనేది పక్కాగా తెలుసుకోండి. ముందుగా మీ ప్రేమ ఎలా మొదలైందో గుర్తు చేసుకోండి. మీ ప్రయాణంలో ప్రతి మలుపు.. మీరు, మీ భాగస్వామి పరిస్థితిపై స్పందించిన విధానం.. తీసుకున్న నిర్ణయాలను పరిశీలించండి. చాలా మంది తమ స్నేహితుల ముందు తమ మనసును ఖచ్చితంగా బయటపెడతారు. ఏదో ఒక సమయంలో మీ ప్రస్తావన కూడా వచ్చే ఉంటుంది. అలాంటి సందర్భాలలో మీ గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవడం మంచిది. వారు చెప్పేది గుడ్డిగా నమ్మడం కూడా చాలా ప్రమాదకరం. మనం ప్రేమలో పడినప్పుడు, మన భాగస్వామి మనతో మాట్లాడటానికి, సమయం గడపడానికి ఆలోచిస్తుంటారు. కానీ, రోజులు గడిచేకొద్దీ, ఆ సంబంధంలో ఏవైనా మార్పులను గమనించండి. లోపాలు, మితిమీరిన అబద్ధాల చెప్పడం లాంటివి జరుగుతున్నాయోమో గమనించండి. మనం ప్రేమలో ఉన్నప్పుడు, మన భాగస్వామికి కొంత అసౌకర్యం లేదా కోపాన్ని కలిగించినప్పటికీ, మేము వాగ్దానం చేస్తుంటాము. ఇలాంటి సందర్భాల్లో మీకు ఎలాంటి వాగ్దానాలు చేస్తున్నారు? అవి నిజమవుతాయో లేదో ఆలోచించండి. ఎందుకంటే మాటలతో భవనాలు కట్టవచ్చు.. కానీ నిజజీవితంలో చెప్పేది నిజం కాదు.
Read Also: AP Registration: రిజిస్ట్రేషన్లపై కీలక నిర్ణయం.. ఏపీలో అమల్లోకి కొత్త విధానం..
అయితే, మానవ జీవితంలో అబద్ధం చెప్పలేని వారుండరు. ప్రధానంగా ప్రేమలో ఉన్నవారు చాలా సందర్భాలలో వాటిని ఉపయోగిస్తారు. కానీ, అబద్ధంతో మీ సంబంధాన్ని నాశనం చేయనివ్వవద్దు. మీరు చెప్పేది అబద్ధమని ఎదుటి వ్యక్తికి తెలిసినప్పుడు మీ సంబంధం కొనసాగదు. కత్తి కంటే మాట చాలా పదునైనది. అలాంటి ఆకర్షణలో ఇలాంటి అబద్ధాలకు కొదవే ఉండదు. మీరు ఇతరులను మాటలతోనే అంచనా వేయవచ్చు. ఇక పెళ్లి విషయంలోనూ ఇదే తప్పు చేస్తుంటారు కొందరు. మీరు ప్రేమిస్తున్నామంటే ఎదుటి వారిని గుడ్డిగా నమ్మకండి. అవతలి వ్యక్తి కుటుంబం, వ్యక్తిగత వివరాలు పూర్తిగా తెలియాలి. ఏదో సోషల్ మీడియాలో పరిచయం చూడటానికి బాగానే ఉంటుందనుకుంటూ ముందుకు సాగితే బొక్కబోర్లా పడిపోవడం ఖాయం. ఏదైనా ప్రమాదం లేదా సమస్య సంభవించినప్పుడు మీ పట్ల వారి ప్రవర్తనను అంచనా వేయండి. అతను మీతో ఉంటాడో లేదా అతను పక్కకు వెళ్లి మిమ్మల్ని దానిలోకి నెట్టివేస్తాడో గమనించండి. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు, వారు సమస్యను ఎలా ఎదుర్కొంటున్నారో చూడండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడల్లా, అవతలి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో మాట్లాడతాడో గమనించండి. ఆకర్షితులైన చాలా మంది ఈ పరిస్థితిలో బయటపడతారు. మీ ప్రియమైన వారి ఆహారపు అలవాట్లు, ఆర్థిక విషయాలలో వారి ప్రవర్తనను పరిశీలించండి.
Read Also: Valentine’s Day: వాలెంటైన్ ఎవరు..? ప్రేమికుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది..?
ప్రేమ అనేది కాసేపు నిలిచిపోయే సీజన్ లాంటిది కాదు.. ఇతరుల జీవితంలోకి ప్రవేశించాలనుకున్నప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవడం తప్పు కాదు.. కాబట్టి మీ సంబంధం డబ్బు చుట్టూ తిరగకూడదు.. అలాంటి వారి మధ్య ప్రేమ ఉండదు. మా స్నేహితులకు ప్రేమికులు ఉన్నారు. మనకి లేరనో.. బైక్‌పై జంటగా తిరిగితే ఆ మజాయే వేరనో.. లేదంటే సినిమాల్లో చూసినట్టు మనం కూడా ఉండాలనో.. లేదంటే ఏదొక రాయి వేద్దాం.. పడితే కొన్నాళ్లు ఎంజాయ్ చేద్దాం.. అన్నీ కుదిరితే పెళ్లి చేసుకోవచ్చు. లేదంటే బ్రేకప్ చెప్పేద్దామనో, అలాంటి ఆలోచనలు ఉంటే ఆపేయండి.. ఎందుకంటే ప్రేమ అనేది మనసుకు సంబంధించినది. ఇతరులు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తే, వారు తమ ప్రాణాలను కోల్పోతారు. అందుకే మనసుతో ఆడుకోకూడదు. ఈ ప్రశ్నలు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే రేపు వచ్చే పరిస్థితులకు నువ్వే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.. ఇప్పటికైనా ఆలస్యం అయ్యిందేమీ లేదు.. నిజంగా మీ మధ్యలో ఉంది ప్రేమేనా..? ఆకర్షణనే మీరు ప్రేమగా ఊహించుకుంటున్నారా..? అలా ఓ లుక్ వేసి.. ఇలా చెక్ చేసుకోండి..
తాజావార్తలు
-
AK 47 Release Date: ఇట్స్ అఫీషియల్.. ‘ఆదర్శ కుటుంబం 47’ వచ్చేది అప్పుడే!
-
AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణలపై కూటమి సమన్వయ కమిటీల దృష్టి.. అసంతృప్తులకు బుజ్జగింపులు
-
Rahul Gandhi: ‘‘హాలిడే ట్రిప్‌కు రాహుల్ గాంధీ’’.. అబద్ధాలు చెప్పి అలసిపోయాడని బీజేపీ సెటైర్లు..
-
Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
-
Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!