మిర్చి ధరలకు సంబంధించి ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నేతృత్వంలో రేపు సమావేశం జరగనుంది.. రేపు ఉదయం 11 గంటలకు కృషిభవన్‌లో సమావేశం కానున్నారు కేంద్ర మంత్రి . ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి ధరలు పడిపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.. ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని కోరింది.. దీంతో కేంద్ర మంత్రి సమావేశం నిర్వహించనున్నారు.
అధైర్య పడొద్దు.. మిర్చి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లాం.. రైతులని ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కలిసి చెప్పాను. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తెచ్చాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25 శాతం మాత్రమే ఇస్తారు
ఆంధ్రప్రదేశ్‌లో 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం.. లోకాయుక్త ఆదేశాలతో విధులకు డుమ్మా కొట్టిన వైద్యులను విధుల నుంచి టెర్మినేట్ చేసింది ఏపీ ప్రభుత్వం.. చర్యలు తీసుకున్నట్టు లోకాయుక్తకు నివేదిక పంపించింది ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ.. తొలగింపునకు గురైన వైద్యుల్లో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు..
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. వైఎస్ జగన్ భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లో ఉందని.. ఇలాంటప్పుడు ఎక్కడికీ అనుమతి లేకుండా వెళ్లకూడదు.. కానీ, ఈసీ నియమావళిని ఉల్లంఘిస్తూ జగన్ మిర్చి యార్డుకు వెళ్లారని మండిపడ్డారు..
వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు వైయస్సార్సీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.. జగన్ కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్లిన జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించలేదని దుయ్యబట్టారు..
విద్యుత్ ఛార్జీల టారిఫ్ విడుదల చేసింది ఏపీ ఈఆర్సీ.. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఈ సందర్భంగా ప్రకటించారు ఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్.. 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల టారిఫ్‌లను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఛైర్మన్ ఈ రోజు తిరుపతిలో విడుదల చేశారు..
ఏపీ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ముంబైలో పర్యటిస్తున్నారు.. మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఇతర అధికారులు.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (MMRDA), సిడ్కో అధికారులతో సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో MMRDA ప్లానింగ్ డైరెక్టర్ శంకర్ దేశ్ పాండే, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు..
ఏపీలో సమన్వయంతోనే కలిసి ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు పవన్.. వెన్ను నొప్పి కారణంగానే ఏపీలో కొన్ని సమావేశాలకి హాజరుకాలేకపోయానన్న ఆయన.. ఇప్పటికీ వెన్ను నొప్పి తీవ్రంగా బాధిస్తోందన్నారు.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.. అయితే, ఏపీని వైఎస్ జగన్ అప్పుల కుప్పగా మార్చారు.. ఆ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీల అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం.. పర్యావరణ, అటవీ శాఖలు నాకు చాలా ఇష్టమైన శాఖలు.. నిబద్ధతతో నా…