ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు.. ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలు హాజరయ్యారు.. ఇక, ఇదే కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.. అయితే, ఆ వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఆసక్తికర చర్చ సాగింది.. మొత్తానికి పవన్ కల్యాణ్ను ప్రధాని మోడీ పలకరించడం.. దానికి…
వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు నమోదు చేశారు గుంటూరులో పోలీసులు.. ఈ రోజు గుంటూరు మిర్చి యార్డ్లో వైఎస్ జగన్ పర్యటించిన విషయం విదితమే కాగా.. ఈ పర్యటన నేపథ్యంలో వైఎస్ జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు..
తెలంగాణలో కొత్త రాజకీయ రగడ మొదలైంది. కాకుంటే... ఇది మత పరంగా సున్నితమైన అంశం కావడంతో... జాగ్రత్తగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇదే సమయంలో బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ అనుసరిస్తోందన్న చర్చ సైతం మొదలైంది. త్వరలో రంజాన్ మాసం మొదలవబోతోంది. ఈ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాయి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు. ఆఫీస్ సాధారణ సమయం కంటే ఒక గంట ముందే... అంటే సాయంత్రం నాలుగు గంటలకే ముస్లిం ఉద్యోగులంతా విధులు ముగించుకుని వెళ్ళిపోవచ్చు.
గత అసెంబ్లీ ఎన్నికల పరాజయంపై గట్టిగానే పోస్ట్ మార్టం చేసుకున్న వైసీపీ ఇప్పుడిక దిద్దుబాటు చర్యల్ని ముమ్మరం చేస్తోందట. ఒక్క ఓటమి వంద అనుభవాలు నేర్పుతుందన్నట్లుగా... పార్టీకి ఒక పద్ధతి ప్రకారం టింకరింగ్ వర్క్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. 2024లో ప్రధానంగా... ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గం తమకు అండగా లేకపోవడం వల్లే డ్యామేజ్ తీవ్రత పెరిగిందని గుర్తించి ఆ కోణంలో రిపేర్ మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు.
వల్లభనేని వంశీ.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే. టీడీపీ నుంచి ఎంపీగా ఒకసారి, ఎమ్మెల్యేగా రెండుసార్లు బీఫామ్స్ తీసుకున్నారాయన. ఎంపీగా ఓడినా గన్నవరం ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు గెలిచారు. ఇక 2019లో టీడీపీ తరపునే గెలిచిన వంశీ నాడు అధికారంలోకి వచ్చిన వైసీపీకి జైకొట్టారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు భద్రతా వైఫల్యంపై రేపు గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ నేతలు. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ నజీర్ను.. కలవనుంది వైసీపీ నేతల బృందం. జగన్కు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పేషీల్లో సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఒకే మంత్రి పేషీలో నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు సోషల్ మీడియా అసిస్టెంట్లను నియమించినట్టు సమాచారం. సోషల్ మీడియా అసిస్టెంట్ నియామక ప్రక్రియ బాధ్యత ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఫేక్ అపోయింట్మెంట్ ఆర్డర్ బయటకు వచ్చింది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వల్లభనేని వంశీకి సంబంధించిన పలు పిటిషన్ల మీద బెజవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయటంతో విచారణ జరిపారు.
హిందూ ధర్మం సనాతన ధర్మం.. మానవ సేవే మాధవ సేవ.. సాటి మనుషులకు, సమాజానికి సేవ చేస్తే, ఆ దేవుడికి సేవ చేసినట్టేనని హిందూ ధర్మం చెబుతోందన్నారు మంత్రి నారా లోకేష్. తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ మరియు ఎక్స్పో ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుందన్నారు..