ఎల్లుండి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. 2025-26 బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఉభయ సభలను (శాసనసభ, శాసనమండలి) ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది..
ఎస్సీ వర్గీకరణ మా ధ్యేయం.. అమలు చేయాలని సీఎం చంద్రబాబుని కోరుతున్నాం అన్నారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరుతున్నాం అన్నారు..
గ్రూప్-2 పరీక్షల్లో పెద్ద ట్విస్ట్ వచ్చి చేరింది.. గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం.. రేపు నిర్వహించాల్సిన పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.. రోస్టర్ తప్పుల సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి..
తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చింది కేంద్ర హోం శాఖ. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడ్డ ముగ్గురు అధికారులు.. వెంటనే ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది కేంద్ర హోంశాఖ..
వైయస్ కుటుంబానికి కంచుకోట కడప. ప్రత్యేకించి మున్సిపల్ కార్పొరేషన్లో ఆ కుటుంబం చెప్పిందే వేదం. వాళ్ళ అనుయాయులే అక్కడ కార్పొరేటర్లు. ఇప్పటివరకు మూడు సార్లు ఇక్కడ ఎన్నికలు జరగ్గా.. వైఎస్ కుటుంబ సభ్యులు చెప్పినవాళ్లే.. మేయర్స్ అయ్యారు. అందులో రెండు విడతల నుంచి కొనసాగుతున్నారు కొత్తమద్ది సురేష్ బాబు. ఇలాంటి పరిస్థితుల్లో... పాతికేళ్ళ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కడప ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డప్పగారి మాధవి...
తెలంగాణ రాజకీయం కూడా సమ్మర్ సెగల్లాగే మెల్లిగా హీటెక్కుతోంది. ఓ వైపు ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పీక్స్‌లో ఉంది. కానీ.. ఆ ఎలక్షన్స్‌కు దూరంగా ఉన్న బీఆర్ఎస్ పెద్దలు ఇస్తున్న ఉప ఎన్నికల స్టేట్మెంట్స్ మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అది కూడా వాళ్ళు వీళ్ళు కాకుండా... స్వయంగా కేసీఆర్ నోటి నుంచే బైపోల్ వ్యాఖ్యలు రావడంతో.... కళ్ళన్నీ ఒక్కసారిగా అటువైపు టర్న్ అయ్యాయి.
బీఆర్ఎస్ ఎస్ఆర్ఎస్పై నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఒక్కో నాయకుడు ఒక్కో విధంగా ఆరోపణలు చేసినా.. అంతిమంగా తాము అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ని రద్దు చేసి... పేద, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా ప్లాట్లు క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. కానీ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా... ఇప్పటిదాకా ఆ ఊసే లేదంటూ... విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ.
సోషల్ మీడియా పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అసలు, సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నిరోధానికి ఏ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో ఆ వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. సోషల్ మీడియాలో పెడుతున్న అసభ్య, అభ్యంతరకరమైన పోస్టులు కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది..
టీటీడీ పాలకమండలి సభ్యుడు.. ఉద్యోగి మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు ముగిసింది. మూడు రోజులు క్రితం మహాద్వారం గేటు తెరిచే అంశంపై పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్... టీటీడీ ఉద్యోగి బాలాజీ మధ్య తలెత్తిన వివాదానికి ఉద్యోగ సంఘ నేతలు ముగింపు పలికారు.