పదేళ్ళు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్ఎస్... తిరిగి పుంజుకుని జనాల్లో ఉండడానికి సరికొత్త ప్లానింగ్‌లో ఉందట. ఏది ఏమైనా సరే... ప్రభుత్వం మీద పోరాటం విషయంలో వెనక్కి తగ్గకూడదని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. అందుకు తగ్గట్టే ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయట.
పిఠాపురం టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ.... గత ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుని కూటమి పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలిపారు. ఇక ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి తన సంగతి ఏంటని అడుగుతూనే ఉన్నారాయన. వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రమోట్ చేస్తామని ఎన్నికలకు ముందు స్వయంగా ప్రకటించారు చంద్రబాబు. అటు వర్మకు గౌరవప్రదమైన స్థానం ఇవ్వడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ కూడా హామీ ఇచ్చేశారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8నెలలవుతున్నా.. తనను…
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంటుందా? లేదా? అనే గందరగోళ పరిస్థితిలో ఉన్న అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. రేపు గ్రూప్- 2 ఉద్యోగాల నియామకం కోసం మెయిన్స్ పరీక్ష యథాతథంగా ఉంటుందని స్పష్టం చేసింది ఏపీపీఎస్సీ.. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష ఉంటుందని.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది..
గ్రూప్-2 మెయిన్స్‌పై గందరగోళం..! స్పందించని ఏపీపీఎస్సీ.. సీఎం అసంతృప్తి..! ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంటుందా? ఉండదా? అనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. గ్రూప్ 2 మెయిన్స్ పై వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలను పూర్తిగా పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం.. అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకుని పరీక్ష వాయిదాపై APPSCకి లేఖ రాసింది.. రోస్టర్ లో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరికాదన్న అభ్యర్థుల వాదనను అర్థం చేసుకుంది ప్రభుత్వం.. రోస్టర్ సమస్యను, అభ్యర్ధుల న్యాయబద్దమైన […]
గ్రూప్ -2 అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.. విశాఖపట్నంలో తమ పోరును ఉధృతం చేశారు గ్రూప్-2 అభ్యర్థులు.. ఇసుక తోట జంక్షన్ లో జాతీయ రహదారిని దిగ్భందించి నిరసనకు దిగారు.. దాంతో, భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన అడ్డుకునేందుకు పోలీసులులు ప్రయత్నించారు.. దీంతో, పోలీసులకు అభ్యర్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.. ఎగ్జామ్ బాయ్ కాట్ చేయాలి అంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు గ్రూప్-2 అభ్యర్థులు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన విషయం విదితమే కాగా.. ఆ ప్రమాదంపై ఆరా తీశారు ప్రధాని.. ఇక, జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోడీకి ఫోన్లో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.. ఎస్ఎల్బీసీ సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని తెలిపారు తెలంగాణ సీఎం..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నకిలీ నోట్ల ముఠాలు రెచ్చిపోతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని దొంగ నోట్లను మార్పిడి చేయడమే పనిగా పెట్టుకున్నాయి. నకిలీ నోట్లు ప్రింట్ చేసేందుకు అవసరమైన సామాగ్రిని చైనా నుంచి దిగుమతి చేసుకొని మరి చెలరేగిపోతున్నాయి.
అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడంపై కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.. అంతేకాదు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది..
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంటుందా? ఉండదా? అనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. గ్రూప్ 2 మెయిన్స్ పై వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలను పూర్తిగా పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం.. అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకుని పరీక్ష వాయిదాపై APPSCకి లేఖ రాసింది.. రోస్టర్ లో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరికాదన్న అభ్యర్థుల వాదనను అర్థం చేసుకుంది ప్రభుత్వం.. రోస్టర్ సమస్యను, అభ్యర్ధుల న్యాయబద్దమైన విన్నపాలను వివరిస్తూ పరీక్ష వాయిదా కోరుతూ ప్రభుత్వం లేఖ రాసింది.. అయితే నిన్ననే లేఖ రాసినా…