Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Cm Chandrababu Speaks To Media At Delhi

CM Chandrababu: రాజధానిగా అమరావతిని నోటిఫై చేయండి..

NTV Telugu Twitter
Published Date :May 23, 2025 , 10:12 pm
By Sudhakar Ravula
  • ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం..
  • విభజన చట్టంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పెట్టారు..
  • పదేళ్లయిపోయింది కాబట్టి ఇప్పుడు రాజధానిగా లేదు..
  • గతంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించారు..
  • ఇప్పుడు చట్ట సవరణ చేసి అమరావతిని నోటిఫై చేయాలని కోరాం..
CM Chandrababu: రాజధానిగా అమరావతిని నోటిఫై చేయండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: విభజన చట్టంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పెట్టారు.. పదేళ్లయిపోయింది కాబట్టి ఇప్పుడు రాజధానిగా లేదు.. గతంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించారు.. ఇప్పుడు చట్ట సవరణ చేసి అమరావతిని నోటిఫై చేయాలని కోరామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌ సహా మరికొందరితో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. 2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగింది.. గత ప్రభుత్వం రూ.లక్షా ఇరవై వేల కోట్లు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టింది.. ఈ ఏడాది రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి అని తెలిపారు.

Read Also: Off The Record: ఆ మాజీ మంత్రి వ్యవహారం వైసీపీలో బూమ్ రాంగ్ అయ్యిందా..?

వైసీపీ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే పదేళ్లు పడుతుంది.. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించాం.. దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా ఏపీకి ఈ ఏడాది పెట్టుబడులు వచ్చాయి.. ఏడుగురు మంత్రులను కలిశాను.. ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం.. 72 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ పవర్‌ ఉత్పత్తి చేస్తాం.. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం.. మేజర్‌గా ఏపీ నుంచి ఉత్పత్తి చేస్తాం అన్నారు.. రూ. 28 వేల 346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని ప్రహ్లాద్ జోషిని కోరామని తెలిపారు చంద్రబాబు.. రాయలసీమలో 11 గిగావాట్ల సోలార్‌ పవర్‌ను ఉత్పత్తి చేయాలి.. దీనికి ప్రహ్లాద్ జోషి అంగీకరించారు.. సూర్యఘర్ కింద ప్రతి నియోజకవర్గంలో 10 వేల కుటుంబాలకు విద్యుత్ ఇస్తాం.. సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం అన్నారు..

Read Also: RCB vs SRH: ఇషాన్ కిషన్ వన్ మ్యాన్ షో.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్..!

ఏపీలో నాలుగు డిఫెన్స్‌ ఉత్పత్తి కేంద్రాలకు రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశాను అన్నారు చంద్రబాబు. జగ్గయ్యపేట-దొనకొండ క్లస్టర్‌లో మిస్సైల్‌ ప్రొడక్షన్‌ సెంటర్‌.. లేపాక్షి-మడకశిరలో మిలటరీ అండ్ సివిల్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ తయారీ.. విశాఖ-అనకాపల్లి క్లస్టర్‌లో నేవల్‌ ఎక్విప్‌మెంట్‌ ప్రొడక్షన్‌.. కర్నూలు-ఓర్వకల్లులో మిలటరీ డ్రోన్ల తయారీ చేయాలని కోరాను అన్నారు. ఇక, ఏపీలో ఆర్మీ కంటోన్మెంట్‌ లేదు.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కంటోన్మెంట్‌లు ఉన్నాయి.. ఏపీలో కంటోన్మెంట్‌ కోరాం.. వర్కవుట్‌ చేస్తామని రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చారని వెల్లడించారు..

Read Also: Theatres Closure : థియేటర్లు మూసివేయాలని ఆ నలుగురు నిర్మాతల ఒత్తిడి.. రంగంలోకి ఏపీ మంత్రి

2019-24లో ఏపీలో భారీ విధ్వంసం జరిగింది.. పునర్నిర్మాణానికి కనీసం పదేళ్లు పడుతుంది.. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు చంద్రబాబు.. ఏడాది కాలంగా అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం.. ఎన్నడూ చూడనంత విధ్వంసం జరిగింది.. ఏపీని పునర్నిర్మిస్తున్నాం.. ఏమాత్రం వెసులుబాటు లేనంతగా నష్టపోయిందన్నారు.. ఇక, పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్ర జలశక్తి మంత్రికి రిపోర్ట్‌ చేశా.. ఫాస్ట్‌ట్రాక్‌లోప్రాజెక్ట్‌ నిర్మాణం జరుగుతోంది.. 2027కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. వీలైతే 2027 మార్చికే పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాం.. ప్రాజెక్‌ నిర్మాణం, నాణ్యతో రాజీ పడట్లేదన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati
  • Andhra Pradesh
  • cm chandrababu
  • Delhi

తాజావార్తలు

  • Nothing Phone 3: జూలై 1న లాంచ్ కాబోతున్న నథింగ్ ఫోన్ 3.. స్పెసిఫికేషన్స్ ఇవే..!

  • Rahul Gandhi: 19న రాహుల్ గాంధీ బర్త్‌డే.. యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం..!

  • KTR Sends Legal Notice: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

  • Eesha Rebba : జాలిలాంటి చీరలో ఈషారెబ్బా అందాల విందు

  • KA Paul: ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి.. లేదంటే నేను రంగంలోకి దిగుతా..!

ట్రెండింగ్‌

  • OnePlus Nord: మొబైల్ లవర్స్ రెడీగా ఉండండి.. దమ్మున్న ఫీచర్ల మొబైల్స్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన వన్‌ప్లస్..!

  • POCO F7: కాస్త ఆలస్యమైనా కిరాక్ ఫీచర్లతో గ్లోబల్ లాంచ్ కు సిద్దమైన పోకో F7..!

  • Trump Mobile 5G: మొబైల్ మార్కెట్‌లోకి ట్రంప్ ఫ్యామిలీ ఎంట్రీ.. ట్రంప్ మొబైల్ 5G నెట్‌వర్క్ ప్రారంభం..!

  • Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions