NIA: పేలుళ్ల కుట్ర కేసులో కూపీ లాగుతున్న ఎన్‌ఐఏ.. ఏ నగరాలను టార్గెట్ చేసారు..?
- బాంబు పేలుళ్ల కుట్ర కేసులో విచారణ వేగవంతం..
- సిరాజ్, సమీర్‌లను ప్రశ్నిస్తున్న విజయనగరం పోలీసులు..
- రంగంలోకి ఎన్ఐఏ.. ఏ నగరాలను టార్గెట్ చేశారని ప్రశ్నల వర్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA: బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు సిరాజ్, సమీర్‌లను విజయనగరం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారిద్దరినీ 7 రోజుల కస్టడీకి ఇస్తూ గురువారం సాయంత్రమే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలిచ్చింది. వారిద్దరూ విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. శుక్రవారం ఉదయమే విశాఖ సెంట్రల్ జైలుకు చేరుకున్న విజయనగరం పోలీసులు… సిరాజ్, సమీర్‌లను కస్టడీలోకి తీసుకుని విజయనగరంలోని పోలీస్ ట్రెయినింగ్ కాలేజీకి తరలించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ మాధవరెడ్డి, ఎన్ఐఏ, ఏటీఎస్ అధికారులు కూడా అక్కడకు చేరుకున్నారు. అందరూ కలసి సంయుక్తంగా సిరాజ్, సమీర్‌లను ప్రశ్నించారు.
Read Also: Germany: రైల్వే స్టేషన్‌లో కత్తితో మహిళ వీరంగం.. 12 మందికి తీవ్రగాయాలు
Also Read
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
కస్టడీలో సిరాజ్, సమీర్‌ల నుంచి పూర్తి వివరాలు రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఏ ఏ నగరాలను టార్గెట్ చేశారు..? ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారు..? ప్లాన్‌ని ఎప్పుడు, ఎలా అమలు చేయాలనుకున్నారనేది ఆరా తీస్తున్నారు. వీళ్లని ఎవరు రిక్రూట్ చేసుకుంటున్నారు..? సౌదీ అరేబియా నుంచి ఎందుకు ఆపరేట్ చేస్తున్నారు..? పేలుళ్ల కుట్ర వెనుక.. అసలేం జరిగింది..? ఉగ్ర కార్యకలాపాలకు పాక్ టెర్రరిస్ట్ సంస్థలు సౌదీని వాడుకుంటున్నాయా..? అనే కోణంలోనూ ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఉగ్రసంస్థకు చెందిన హ్యాండ్లర్… వరుసగా రిక్రూట్ చేసుకోవడం, వారిని సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ కావడంపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ, ఎప్పుడు, ఎలా పేలుళ్లకు జరపాలనుకున్నారనే విషయాలే కాకుండా… ఉగ్ర కార్యకలాపాలకు అవసరమైన ఆర్థికసాయం గురించి కూడా ఆరా తీస్తున్నారు అధికారులు.
Read Also: Nizamabad: జక్రాన్ పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. బావ బామ్మర్దుల మృతి
సిరాజ్, సయ్యద్ సమీర్ లాంటివాళ్లు మరికొంతమంది ఉండొచ్చని భావిస్తున్న ఎన్‌ఐఏ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్, వరంగల్ సహా దేశ, విదేశాల్లో ఉగ్రవాద భావజాలమున్న యువకులతో వీరికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. సిరాజ్ లాంటివాళ్లు మరికొందరు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇక, ఉగ్ర కుట్ర నిందుతులు సిరాజ్, సమీర్‌ను నేడు రెండో రోజు విచారించనుంది ఎన్‌ఐఏ.. సిరాజ్ ఎక్కడెక్కడ కుట్ర ప్లాన్ చేసారు అన్న కోణంలోనే విచారణ సాగనుంది.. ఉగ్ర లింక్స్, పరిచయాలపైనేలు, ఎంత డబ్బులు ఇచ్చారు, వాటితో ఏం కొనుగోలు చేసారు.. బాంబుల తయాలికి ఏమైనా శిక్షణ ఇచ్చారా..? వాళ్ల టార్గెల్ ఎవ్వరు? పెద్ద వ్యక్తుల అంటే ఏ స్థాయి వాళ్లు? అన్న కోణంలోనే ఎన్‌ఐఏ విచారణ సాగనుంది..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!