Cyclone Alert: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా మారి తుఫాన్‌గా మారిందని.. దానికి ‘దిత్వా’గా నామకరణం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో 15 కిలో మీటర్ల వేగంతో కదులుతూ తుపాన్ ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)కు 200 కిలో మీటర్లు.. పుదుచ్చేరికి 610 కిలో మీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా సుమారు 700 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.. Read […]
Botsa Satyanarayana: పీపీపీ మోడల్‌పై బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రకటించారు.. ప్రజల కోసం.. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ పోరాటం అని పేర్కొన్నారు.. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేట్ దక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల […]
Minister BC Janardhan Reddy: భోగాపురం ఎయిర్‌పోర్టు గడువు కంటే ముందే పూర్తి చేయబోతున్నాం… ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6 విమానాశ్రయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు రోడ్లు–భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల పరిస్థితి దారుణంగా మారడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీసీ జనార్ధన్ రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో రోడ్ల సంరక్షణ, మరమ్మతులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం ప్రభుత్వం భారీ ఆర్థిక భారం మోస్తోందని ఆయన […]
CM Chandrababu: అమరావతి రైతుల ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఆర్డీఏ అధికారులు, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి డాక్టర్ నారాయణ పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు గత ప్రభుత్వ కాలంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని సీఎం పేర్కొన్నారు. వారి సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని తక్షణ పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. రైతులు చేసిన త్యాగం […]
Off The Record: ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె రాజకీయం కాస్త డిఫరెంట్. డెల్టా ఏరియాలో కీలకమైన సెగ్మెంట్ ఇది. గత మూడు ఎన్నికల్లో ఇక్కడనుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసిన అనగాని సత్యప్రసాద్ విజయంసాధించారు. దీంతో రేపల్లె టీడీపీ అడ్డాగా మారింది. మరోవైపు 2009లో రేపల్లె నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా గెలిచిన మోపిదేవి వెంకటరమణ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీనుంచి వరుసగా 2014, 2019లో పోటీచేసి అనగాని చేతిలో ఓడిపోయారాయన. దీంతో వైసీపీ అధిష్టానం మోపిదేవిని కాదని […]
Off The Record: అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా…100 శాతం స్ట్రైక్ రేట్‌తో అధికారంలోకి వచ్చాక కూడా జనసేన నడవడికలో తడబాటు కనిపిస్తోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఎన్నికల వరకు అన్ని రకాలుగా పార్టీని ముందుండి నడిపించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బిజీ అయ్యారు. అలాగే నాదెండ్ల మనోహర్ కూడా మంత్రి హోదాలో బిజీ అవడంతో… పార్టీ వ్యవహారాలు గాడి తప్పుతున్నాయన్న అభిప్రాయం సొంత వర్గాల్లోనే బలపడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ […]
Off The Record: ఎమ్మెల్యేలూ…. మీరు మారాలి. పనితీరు మార్చుకోవాలి. ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ శాసనసభ్యులతో పదే పదే చెబుతున్న మాటలివి. కొందరికి జనరల్‌గా చెప్పారు. ఇంకొందర్ని ప్రత్యేకంగా పిలిపించి క్లాస్ పీకారు. మీరు మారకుంటే… నేను మారిపోతానని కూడా వార్నింగ్ ఇచ్చేశారు. అయితే… అంత చెప్పినా ఇప్పటికీ ఇంకొందరిలో మార్పు రాలేదట. ఆ…. ఏముందిలే…. ఆయన అలాగే చెబుతుంటారు. మనం చేసేవి చేసుకుంటూ పోదామని భావిస్తున్న ఎమ్మెల్యేలకు ఇప్పడిక షాకులివ్వడం మొదలైపోయిందట. నేను 95 […]
గూగుల్ బాటలో రిలయన్స్.. ఏపీలో మరో భారీ పెట్టుబడి.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం హయాంలో వరుసగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి.. ఇప్పటికే గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఒక లక్ష 34 వేల కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ను నెలకొల్పుతున్న సంగతి విషయం విదితమే కాగా.. ఈ విదేశీ సంస్థ బాటలో మన స్వదేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ కూడా విశాఖలోనే రూ.98,000 కోట్లతో 1 గిగా వాట్ సామర్థ్యం కలిగిన అతిపెద్ద హైపర్ స్కేల్ […]
AP High Court: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆరా తీసింది హైకోర్టు.. అదే సమయంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు హోంశాఖ సెక్రటరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై 6 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంపై పిటిషన్ దాఖలైన నేపథ్యంలో విచారణ జరిపిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి కఠిన సూచనలు చేసింది. సుప్రీం […]
AP Liquor Scam: లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురికీ సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. కేసులో ఈ ముగ్గురు కూడా ఏ31, ఏ32, ఏ33గా ఉన్నారు. వీరికి ఏసీబీ కోర్టు గతంలో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ ఆదేశాలను సిట్ అధికారులు హైకోర్టులో సవాలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేసింది. ఈ నెల 26లోపుగా […]