-
దళితులు ఎవ్వరూ బీజేపీకి ఓటు వేయొద్దు.. తరిమికొట్టాలి..!
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి… అసలు దళితులు ఎవ్వరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి… వైసీపీ దళిత ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దళితుల గురించి అవహేళనగా మాట్లాడిన ఆదినారాయణ రెడ్డిని బద్వేల్ ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు… దళితులకు నాగరికత లేదని మాట్లాడే ఆదినారాయణరెడ్డికి అసలు దళితుల ఓట్లు అడిగే హక్కులేదన్న ఆయన.. దళితులు ఎవ్వరూ బీజేపీకి […] -
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్..
తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు సంచలనం సృష్టించింది.. 2019లో జయరాం అత్యంత దారుణంగా హత్యకు గురికాగా.. మరోసారి ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.. ఏకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్నే నిందితులు బెదిరించండం సంచలనంగా మారింది.. ఈ హత్య కేసు నుంచి బయటపడేందుకు సాక్షులు, పీపీకి బెదిరింపు లేఖలు రాసినట్టుగా గుర్తించారు.. ముఖ్యమైన సాక్షులను బెదిరించి కేసు నుండి బయట పడేందుకు పక్కా ప్లాన్ వేశారు నిందితులు.. జైలులో ఉన్న రాకేష్ […] -
కేటీఆర్ సిద్ధమా..? రేవంత్ రెడ్డి సవాల్..
మరోసారి సవాళ్ల పర్వం తెరపైకి వచ్చింది.. తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తాను చెప్పే అంశాలపై కేటీఆర్ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.. కేటీఆర్‌తో చర్చకు తానే స్వయంగా వస్తానన్న రేవంత్… అయినా.. తమ పార్టీలో సీనియర్ల గురించి మాట్లాడేందుకు కేటీఆర్ ఎవరు? అని ప్రశ్నించారు. ఇక, తాము ఏదైనా అంటే కోర్టుకు పోతారని.. అయినా పిరికివాళ్ల గురించి ఏం మాట్లాడుతాం అంటూ రేవంత్ రెడ్డి […] -
పెట్రో ధరల తగ్గింపు చర్యలు.. కేంద్రం కీలక ప్రకటన..!
పెట్రో ధరల మంట సామాన్యుడికి భారంగా మారిపోతోంది.. పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పైకి ఎగబాకుతుండడంతో.. నిత్యావసరాలు మొదలు, ఇతర వస్తువలపై కూడా దాని ప్రభావం క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే, పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే అందరికీ ఉపశమనం కలుగుతుందనే చర్చ ఎప్పటి నుంచూ జరుగుతూనే ఉంది.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైన ప్రతీసారి.. ఇక, ఈ సారి.. చమురు ధరలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయనే ప్రచారం కూడా సాగుతూ వచ్చింది. అయితే, పెట్రోల్, డీజిల్ […] -
టీఆర్ఎస్-బీజేపీ తోడు దొంగలు.. అందుకే దళిత బంధు ఆగింది..!
టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ తోడు దొంగలు.. వారివల్లే హుజురాబాద్‌లో దళితబంధు పథకం ఆగిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. దళిత బంధు ఆపడంలో టీఆర్ఎస్-బీజేపీ తోడు దొంగలు.. ఇద్దరి కుమ్మక్కులో భాగమే దళిత బంధు ఆగిపోవడం అని విమర్శించారు.. ఇక, రైతు బంధు అగొద్దని ఎన్నికల కమిషన్ దగ్గర అమలు చేసిన సీఎం కేసీఆర్.. దళిత బంధు విషయంలో ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నించారు. దళిత బంధు పాత […] -
కోవాగ్జిన్‌పై తేల్చేసేందుకు సిద్ధమైన డబ్ల్యూహెచ్‌వో..
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా భారత్ నుంచి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. కోవాగ్జిన్, కోవీషీల్డ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంచుకుంది.. ఇక, ఇతర దేశాలకు చెందిన వ్యాక్సిన్లకు సైతం ఆమోదం తెలిపింది కేంద్రం.. దీంతో.. మరికొన్ని వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయతే, భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కానీ, త్వరలోనే తేల్చేందుకు మాత్రం […] -
కేంద్ర మంత్రిని తొలగించాలి.. వెంటనే అరెస్ట్ చేయాలి..!
ఉత్తరప్రదేశ్ లో జరిగిన లఖింపూర్ ఘటన దేశవ్యాపితంగా పెను దుమారమే లేపింది… యోగి సర్కార్ నుంచి మోడీ సర్కార్ వరకు.. అందరిపై విమర్శలు, ఆరోపణలు పెరిగి పోయాయి.. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప.. విచారణ ముందుకు సగలేదని విపక్షాలు మండిపడుతున్నాయి.. అయితే ఈ కేసులో దర్యాప్తు పట్ల భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై సెక్షన్ 120బి కింద కేసు నమోదు చేయాలి. […] -
కోర్టులోనే లాయర్ మర్డర్
కోర్టులోనే దారుణం జరిగింది.. ఓ లాయర్ ను నాటు తుపాకితో కాల్చి చంపారు దుండగులు… ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది.. పూర్తి వివరాల లోకి వెళ్తే షాహజన్‌పూర్ జిల్లా కోర్టులో భూపేంద్ర ప్రతాప్ సింగ్ అనే లాయర్‌ను కోర్టు లోపలే కాల్చి చంపారు. ఆయన మృతదేహం పక్కన దేశీయంగా తయారు చేసిన నాటు తుపాకీ దొరికినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం కోర్టులో భారీగా పోలీసులు మోహరించారు. అయితే పోలీసు భద్రతా లోపం వల్లే […] -
ముగిసిన సీడబ్ల్యూసీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. సమావేశంలో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మాలను వెల్లడించారు.. ద్రవ్యోల్బణం, రైతాంగ సమస్యలు, రైతులపై జరుగుతున్న దాడులపై, తాజా రాజకీయ పరిస్థితులపై తీర్మానాలు చేసింది సీడబ్ల్యూసీ.. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి […] -
ఏపీ కరోనా అప్డేట్.. భారీగా తగ్గిన కేసులు..
కరోనా కొత్త కేసులపై దసరా పండుగ ప్రభావం స్పష్టంగా కనిపించింది.. దేశవ్యాప్తంగా ఇవాళ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. దీనికి ప్రధాన కారణం టెస్ట్‌ల సంఖ్య తగ్గడమే.. ఇక, ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఏపీలోనూ టెస్ట్‌ల సంఖ్య భారీగా తగ్గిపోయింది.. కొత్త కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి.. బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,243 శాంపిల్స్ పరీక్షించగా.. 332 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఏడుగురు కోవిడ్ […]
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎలా ఆడాలో ఇషాన్ కిషన్‌ను చూసి నేర్చుకో!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
Prabhas – Nbk : ప్రభాస్ ఫౌజీ – బాలయ్య ‘దాదా’లకు OTT సంస్థల స్ట్రిక్ట్ కండిషన్స్
-
BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
-
Pakistan Match Fixing: పాకిస్థాన్ జట్టులో మరోసారి ఫిక్సింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!