Akhil Raj : ‘ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అన్నాడు.. నా తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల సోషల్ మీడియాలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా హీరో అఖిల్ రాజ్, ఒక ఫుడ్ డెలివరీ బాయ్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. తాజాగా ఈ అంశం మీద అఖిల్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అడ్రస్ తప్పుగా చూసి తమ ఇంట్లో పార్సిల్ ఇచ్చి వెళ్ళిపోవడమే కాకుండా, తిరిగి వచ్చి తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించడం వల్లే తాను ఒక కొడుగ్గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని ఆయన క్లారిటీ ఇచ్చారు.
అసలు ఏం జరిగింది?:
“డెలివరీ అడ్రస్ మీద ‘చేలం రెసిడెన్సీ 201’ అని చాలా స్పష్టంగా ఉంది. కానీ సదరు డెలివరీ బాయ్ మా ఎదురుగా ఉన్న ‘అరుణ రెసిడెన్సీ 201’ లో ఉన్న మా నాన్నకు ఆ పార్సిల్ ఇచ్చాడు. ఇంట్లో నలుగురిలో ఎవరో ఒకరు ఆర్డర్ చేసి ఉంటారని మా నాన్న తీసుకున్నారు. ఇది మనదేనా అని అడిగేలోపే వాడు పార్సిల్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఒక డెలివరీ ఇచ్చే ముందు ఓటీపీ లేదా ఫోన్ కాల్ ద్వారా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన కనీస బాధ్యత లేదా?” అని అఖిల్ ప్రశ్నించారు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని వివరిస్తూ.. “మా ఇంట్లో ఎవరూ ఆర్డర్ చేయలేదని తెలిసి దాన్ని పక్కన పెట్టాం. 20 నిమిషాల తర్వాత ఆ అబ్బాయి తిరిగి వచ్చినప్పుడు, ఒక బాధ్యతగల పౌరుడిగా నేను అడ్రస్ చెక్ చేసుకోలేదా భయ్యా అని అడిగాను. కానీ వాడు పూర్తిగా తాగిన మత్తులో ఉన్నాడు. ‘నేను చూసుకోలేదు.. ఇచ్చేసినా.. ఇప్పుడు ఏమైతది?’ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఇంతలో మా అమ్మ వచ్చి, పొరపాటున కవర్ కొంచెం ఓపెన్ అయింది ఏమనుకోకుండా తీసుకోండి అని ఇస్తుంటే.. వాడు దానికి ‘ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా? ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అని అన్నాడు! నా కళ్ల ముందే నా తల్లిని అంత మాట అంటుంటే, ఒక కొడుగ్గా నా ఫ్యామిలీని రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? మీ అమ్మల్ని ఎవరైనా అలా అంటే మీరు ఊరుకుంటారా?” అంటూ అఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
“నేనూ ఒకప్పుడు డెలివరీ బాయ్‌గా పనిచేసినవాడినే”
తనపై వస్తున్న అహంకార ఆరోపణలను అఖిల్ పూర్తిగా తిప్పికొట్టారు. “నేను కూడా ఒకప్పుడు డెలివరీ జాబ్‌లు చేసుకుంటూ, ఎన్నో కష్టాలు పడి ఈ రోజు హీరోగా ఎదిగాను. నా సినిమాలో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చూపించాను. అలాంటి నేను ఒక డెలివరీ బాయ్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని ఎందుకు అనుకుంటాను? మా ఇంటికి డెలివరీ అబ్బాయిలు వస్తే మజ్జిగ ఇచ్చి, పండ్లు ఇచ్చి పంపించే సంస్కారం మా అమ్మ నాన్నలది. కావాలని ఎవరి మీదో నెగిటివిటీ చేయాల్సిన అవసరం నాకు లేదు” అని స్పష్టం చేశారు.
ఈ వివాదంలో మరో షాకింగ్ విషయాన్ని అఖిల్ బయటపెట్టారు. ఎదురింట్లో ఉండే వాళ్లు అడ్రస్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల గతంలో కూడా తమ ఇంటికి ఇలాంటి తప్పుడు డెలివరీలు వచ్చాయన్నారు. “ఇలా తప్పు అడ్రస్‌తో మా ఇంటికి పార్సిళ్లు రావడం ఇది పదో సారి. గతంలో ఒకసారి కండోమ్ ప్యాకెట్లు, మరోసారి సిగరెట్ ప్యాకెట్లు కూడా వచ్చాయి. ఫ్యామిలీతో ఉండే మా ఇంట్లోకి ఇలాంటివి వస్తే ఎంత ఎంబరాసింగ్ ఉంటుందో ఎవరైనా ఆలోచించారా?” అని అఖిల్ నెటిజన్లను నిలదీశారు. సదరు డెలివరీ బాయ్ చాలా అమాయకుడంటూ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై అఖిల్ మండిపడ్డారు. “ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి. నెంబర్ ప్లేట్ లేని బైక్‌లు, కార్లు, హుక్కా బాటిళ్లతో ఉన్న ఫోటోలు కనిపిస్తాయి. వాడు ఆర్డర్ ఇచ్చేసి వెళ్తూ మెట్లు దిగుతుంటేనే.. ‘నువ్వు హీరో కదా, నిన్ను వైరల్ చేస్తా, నాకు తెలుసు నువ్వు’ అంటూ ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేశాడు. వాడు నా మీద ఉమ్మివేసి నన్నే తప్పుబడుతున్నాడు. కొట్టడానికి నేను వెళ్లలేదు, వాడు వీడియో తీస్తుంటే నా కెరీర్ పాడవుతుందని మా నాన్న నన్ను వెనక్కి లాగారు, అంతే!” అని అఖిల్ వివరించారు.
“మీడియా వారికి, ట్విట్టర్ పేజీల వారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నిజానిజాలు తెలియకుండా ఏకపక్షంగా వార్తలు రాయకండి. అక్కడ ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజ్ తీసి చూడండి. నిజంగానే అఖిల్ బలుపెక్కి కొట్టాడో లేదో అప్పుడు మీకే తెలుస్తుంది. ఒకవేళ మా అమ్మనాన్న గానీ, నేను గానీ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా క్షమాపణలు చెప్తాం. కానీ తప్పు చేయకుండా నన్ను, నా తల్లిదండ్రులను ఇష్టం వచ్చినట్టు తిడితే ఎలా?” చివరగా, తాను ఒక సెలబ్రిటీగా అంత అగ్రెసివ్‌గా రియాక్ట్ అవ్వకుండా కామ్‌గా ఉండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాల్సింది కావచ్చునని, కానీ ఆ సమయంలో తల్లి పట్ల జరిగిన అవమానానికి అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని అఖిల్ ఒప్పుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై తాను పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు హీరో అఖిల్ అద్యమారి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!