-
ఈ నెల 28న రాష్ట్ర కేబినెట్ భేటీ
ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం వెలిగ పూడిలోని సచివాలయంలో సమావేశం కానుంది మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, టీడీపీ నేతల భాషపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక, వచ్చేవారం ఢిల్లీ వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధం కావడంతో.. పోటీగా వైసీపీ నేతలు కూడా హస్తిన బాట పట్టనున్నట్టు […] -
ఫోన్ పే నిర్ణయం.. ఇక రూ.50 దాటితే వడ్డింపు..!
మొదట్లో అన్ని ఫ్రీ అంటూ కస్టమర్లను ఆకట్టుకున్న డిజిటల్ పేమెంట్స్ వేదికలు.. ఆ తర్వాత క్రమంగా చార్జీలు వడ్డిస్తున్నాయి.. డిజిటల్ చెల్లింపుల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఫోన్‌పే కూడా ఇదే బాట పట్టింది.. రూ. 50కి మించిన మొబైల్ రీఛార్జీలపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయునన్నట్లు పేర్కొంది. వాల్‌మార్ట్ గ్రూప్‌నకు చెందిన ఈ డిజిటల్ చెల్లింపుల సంస్థ రూ.50 కంటే అధిక విలువ కలిగిన మొబైల్ రీఛార్జీలపై లావాదేవీకి రూ.1 నుంచి రూ.2 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు […] -
యూపీలో కాంగ్రెస్ కొత్త ప్లాన్.. శ్రీకారం చుట్టనున్న ప్రియాంక..
దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.. పెద్ద రాష్ట్రం కావడం.. ఎక్కువ మంది ఎంపీలు ప్రానిథ్యం వహించే రాష్ట్రం కూడా కావడంతో.. జాతీయ పార్టీలు ఈ రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతూ వస్తున్నాయి.. ఇక, స్థానిక ఎస్పీ, బీఎస్పీలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు, బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.. కొత్త వ్యూహాలతో ప్రజల ముందుకు వెళ్తోంది.. […] -
‘కారు’ను వెంటాడుతోన్న‘చపాతీ రోలర్’.. హుజురాబాద్‌లో ఏం చేస్తుందో..?
తెలంగాణలో ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికార టీఆర్ఎస్ పార్టీని ‘చపాతీ రోలర్’ వెంటాడుతూనే వస్తోంది.. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కేటాయించే ‘రొట్టెల పీట’ (చపాతీ రోలర్) కారు గుర్తుకు తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఓటమి ప్రధాన కారణం ఈ చపాతీ రోలరే అని నిర్ధారణకు వచ్చిన టీఆర్ఎస్ నేతలు.. అంతే కాదు, దుబ్బాక బై […] -
గూగుల్ మరో సంచలన నిర్ణయం..! ఇక, ఇలా..
ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.. ఆ సంస్థకు సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.. కరోనా మహమ్మారి కారణంగా పని విధానంలో, జాబ్ స్టైల్లో కీలక మార్పులు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి.. మరీ ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు.. ఒక్కటేంటి.. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే అన్నీ చక్కబెట్టుకునేదానిపై ఫోకస్ పెరిగిపోయింది.. అయితే, క్రమంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. ఉద్యోగుల పని […] -
మినుములతో పాటు ఇవి సాగు చేయండి.. రైతులకు మంత్రి సూచన
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా దొరకని పరిస్థితి వచ్చింది.. అయితే, ఏ పంట పడితే అది వేసి.. నష్టాలు చవిచూడొద్దని చెబుతున్నారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. ఈ యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.. యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయాలని కోరిన ఆయన.. పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలని.. మినుముల […] -
ఈటలపై ఈసీకి మరో ఫిర్యాదు.. డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు..!
హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు మార్లు బీజేపీ అభ్యర్థి ఈటల వ్యవహారంపై ఈసీ తలుపుతట్టిన అధికార టీఆర్ఎస్ పార్టీ.. మరోసారి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు ఫిర్యాదు చేసింది.. బీజేపీ పార్టీ అభ్యర్థి హుజురాబాద్‌లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని.. హుజురాబాద్ నియోజక వర్గంలో కొత్త బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, ఇప్పటికే ఈటల […] -
చంద్రబాబుకి మంత్రి అవంతి సవాల్.. నిరూపిస్తే రాజీనామా..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్.. చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరూపిస్తే తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటించారు.. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజకీయాలు వదిలేస్తారా..? అని ప్రశ్నించారు అవంతి శ్రీనివాస్.. రాష్ట్రంలో 80 శాతం మందికి సంక్షేమ పథకాలు అందాయో? లేదో..? మీ ఎమ్మెల్యేలను అడిగితే తెలుస్తుందంటూ చంద్రబాబుకు హితవుపలికిన ఏపీ మంత్రి… హత్యా రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆగ్రహం […] -
పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక గంట కళ్లు మూసుకుంటే మేమేంటో చూపిస్తాం అంటూ హాట్ కామెంట్లు చేశారు పరిటాల సునీత.. మాలో ప్రవహించేది సీమ రక్తమే నన్న మాజీ మంత్రి.. నా భర్తను చంపినప్పుడు కూడా.. చంద్రబాబు ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామన్నారు. ఇక, ఇప్పటికైనా చంద్రబాబు మీరు మారాలి అంటూ పరిటాల సునీత సూచించారు.. ఇన్నాళ్లూ ఓపిగ్గా ఉన్నాం.. ఇంకా ఓపికతో […] -
టీడీపీ వెంటిలేటర్‌పై ఉంది.. అందుకే బాబులో అసహనం..!
తెలుగుదేశం పార్టీపై మరోసారి హాట్ కామెంట్లు చేశారు వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ వెంటిలేటర్ మీద వున్న పార్టీ అంటూ సెటైర్లు వేసిన ఆయన.. అందుకే చంద్రబాబు అసహనంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.. అందుకే బూతులు మాట్లాడిస్తూ.. కుంటసాకులతో దీక్షలు చేస్తూ.. రాజకీయలబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక, టీడీపీ హయాంలో ప్రజా కంఠక పాలన సాగిందన్నారు సాయిరెడ్డి.. వైసీపీ పాలనలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డ ఆయన.. అందుకే ప్రభుత్వం […]
తాజావార్తలు
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
The Paradise : ‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ టెన్షన్.. రిలీజ్‌కు కేవలం 14 రోజులు మాత్రమే
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎలా ఆడాలో ఇషాన్ కిషన్‌ను చూసి నేర్చుకో!
ట్రెండింగ్
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!