టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. నేడు ఈడీ ముందుకు ఛార్మి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇవాళ సినీ నటి ఛార్మి.. ఈడీ విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్ పెడలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఛార్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ కోణంలో ఛార్మి బ్యాంక్ అకౌంట్స్ ను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. కెల్విన్ అకౌంట్ లోకి ఛార్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందా? ఛార్మి ప్రొడక్షన్ హౌజ్ ఆర్థిక లావాదేవీలపై అరా తీయనుంది. కెల్విన్ కు భారీగా నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈడీ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత కాలంగా కెల్విన్ తో చార్మికి పరిచయం ఉంది? డ్రగ్స్ సేవించారా? కెల్విన్ తో పాటు సరఫరాకు కూడా సహకరించారా? అసలు ఎన్ని సార్లు కెల్విన్ అకౌంట్ కు ఛార్మి… మనీ ట్రాన్స్ఫర్ చేసిందన్న కోణాల్లో ఆధారాలతో కూడిన విచారణ చేయనుంది ఈడీ.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. నిందితుడు కెల్విన్ ఈడీ ముందు అప్రూవర్‌గా మారాడు. ఆరు నెలల క్రితం ఎక్సైజ్ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కెల్విన్‌పై కేసు నమోదు చేశారు. విచారణ సమయంలో ఎక్సైజ్ అధికారులకు ఏమాత్రం సహకరించని కెల్విన్.. ఇప్పుడు ఈడీ కేసుతో అప్రూవర్‌గా మారడంతో ఈ కేసుతో సంబంధమున్న సినీ తారల్లో అలజడి నెలకొంది. అప్రూవర్‌గా మారిన కెల్విన్ ఈడీ అధికారుల ముందు డ్రగ్స్ తీసుకున్న సినిమా స్టార్స్ చిట్టా విప్పాడు. అతని స్టేట్‌మెంట్ ఆధారంగానే సినిమా స్టార్లకు ఈడీ అధికారులు నోటీసులిచ్చారు. డ్రగ్స్ లావాదేవీల వివరాలను కెల్విన్ ఈడీ ముందు బయటపెట్టడంతో.. సినీ తారలకు ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్స్ కోసం కెల్విన్ అకౌంట్లోకి సినిమా వాళ్లు భారీగా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు కెల్విన్ బ్యాంక్ అకౌంట్‌ని ఫ్రీజ్ చేశారు. అతని బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఈడీ అధికారులు సినీ తారల అకౌంట్లను ఫ్రీజ్ చేసే యోచనలో ఉన్నారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
-
Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!