కరోనా మహమ్మారితో అంతా ఇబ్బంది పడుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది సర్కార్.. గత ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డీఏ) పెంపునకు ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.. ఏడో వేతన సవరణ సంఘం సిఫారసుల మేరకు డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇక, పెంచిన డీఏ జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది.. కేంద్రం నిర్ణయంతో.. డీఏ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఊరట దక్కింది.