పెగాసస్ రగడ.. దీదీ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెగాసస్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చగా మారింది.. పార్లమెంట్ సమావేశాలను సైతం పెగాసస్ రగడ కుదిపేస్తోంది.. ప్రతిపక్షాల ఆందోళనతో సమావేశాలు వాయిదా పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సీనియర్ న్యాయమూర్తి మదన్ భీంరావ్ లోకూర్, కోల్‌కత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయ్ భట్టాచార్యల నేతృత్వంలో హ్యాకింగ్, నిఘాలపై దర్యాప్తునకు ద్విసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. అక్రమ హ్యాకింగ్, నిఘా, మొబైల్ ఫోన్ల రికార్డింగ్ వంటి ఆరోపణలపై ఈ కమిటీ విచారణ జరుపుతుందని.. పెగాసస్ రగడపై విచారణకు ఆదేశించిన మొట్టమొదటి రాష్ట్రం తమదే అంటున్నారు మమతా బెనర్జీ. దుమారం రేపుతోనన ఈ వ్యవహారంపై చర్చిస్తారని.. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ చేపడుతుందని ఆశించామన్న దీదీ.. కానీ, ఆ దిశగా కేంద్రం చొరవ తీసుకోవడంలేదని.. అందుకే ఈ నిర్ణయం తీసకున్నట్టు వ్యాఖ్యానించారు. మరోవైపు.. పెగాసస్ స్కామ్ వెలుగుచూసిన తర్వాత… తన ఫోన్లు ట్యాప్ చేస్తారని.. ఫోన్‌కు ప్లాస్టర్ వేశానంటూ దీదీ చేసిన కామెంట్లు చర్చగా మారిన సంగతి తెలిసిందే.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!