మేషం : ఈ రాశివారు ఇవాళ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. నూనె, మిర్చి, మినుము వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. ఇంటి కోసం విలువైన ఫర్నీచర్ సమకూర్చుకంటారు.
వృషభం : ఈ రోజు మీపై ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయాల్లో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. దైవ దర్శనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పువు… స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి సమస్యలు ఎదురవుతాయి. పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
కర్కాటకం : ఈ రోజు మీకు ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి మొహమ్మాటం ఎదురయ్యే అవకాశం ఉంది. ఓర్పుతోనే మీ పనులు సానుకూలమవుతాయి. ప్రముఖులకు విలువైన కానుకలందించి వారికి మరింత చేరువఅవుతారు. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
సింహం : ఈ రోజు మీరు సభలు, సమావేశాల్లో గౌరవం పొందుతారు. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ఖర్చులు అధికం కావడం వల్ల ఆందోళనకు గురవుతారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
కన్య : ఈ రోజు మీరు పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. అనుకోని ఖర్చులు ఇతరాత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
తుల : ఈరోజు మీరు ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అతిగా సంభాషించడం వల్ల అనర్థదాకయం అని గమనించగలరు.
వృశ్చికం : ఈరోజు మీరు బంధువుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. వేళతప్పి ఆహారం భుజించుట వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తలెత్తగలవు. ప్రయాణాలు వాయిదాపడతాయి. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
ధనస్సు : ఈ రోజు మీ భాగస్వామ్యుల మధ్య అవగాన లోపిస్తుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పండ్లు, పూలు, కొబ్బరి చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబీకుల కోసం మంచి మంచి ప్రణాళికలు వేస్తారు.
మకరం : ఈ రోజు మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. ఎదుటివారిని బాగుగా గౌరవిస్తారు. రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. కొన్ని సమస్యలు మబ్బు వీడినట్టుగా వీడిపోవును.
కుంభం : ఈ రోజు ఈ రాశివారికి భాగస్వామికులతో అభిప్రాయభేదాలు తలెత్తే సూచనలున్నాయి. ఆపరేషన్లు చేయునపుడు వైద్యులు జాగ్రత్త వహించడం మంచిది.. స్త్రీలకు అయిన వారి ఆరోగ్యం కలవరపరుస్తుంది. వ్యవసాయ, తోటల రంగాల వారిక వాతావరణం ఆందోళన కలిగిస్తుంది.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. బంధువుల నుంచి మనస్పర్థలు తలెత్తుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.