NTRNeel : ఫస్ట్ లుక్ కూడా రాకుండానే రూ. 55 కోట్ల ఓవర్సీస్ డీల్.. NTR మాస్ ర్యాంపేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్స్ అటు నందమూరి అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సినిమా నుండి ఇంకా ఎలాంటి చిన్న ప్రోమో కూడా విడుదల కాకముందే, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సృష్టించబోయే ప్రభంజనం సృష్టిస్తోంది.
అయితే ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ న్యూస్ ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ మరియు ప్రశాంత్ నీల్ బ్రాండ్ వాల్యూ చూసి డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరలకు హక్కులను కొనుగోలు చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, నార్త్ అమెరికా మరియు యూకే హక్కుల కోసం సుమారు రూ. 55 కోట్ల అడ్వాన్స్ ( North America$11 million + UK$1 million+) డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ చరిత్రలోనే ఇది ఒక అరుదైన మరియు అతిపెద్ద ఓవర్సీస్ డీల్ గా పరిగణించబడుతోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు కేవలం బాహుబలి 2, RRR, కల్కి 2898 AD, మరియు పుష్ప 2 వంటి చిత్రాలు మాత్రమే నార్త్ అమెరికాలో $10 మిలియన్ల మార్కును దాటగలిగాయి. ఇప్పుడు ‘డ్రాగన్’ కూడా అదే బాటలో పయనిస్తూ, విడుదలకు ముందే ఆ స్థాయి బిజినెస్ సాధించడం విశేషం. కేవలం ఓవర్సీస్ మాత్రమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా కళ్ళు చెదిరే బిజినెస్ చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 20న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ ప్రకటనతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి.
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
తాజావార్తలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!