పరిశ్రమలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. నేడు రూ. 1,124 కోట్ల ప్రోత్సాహకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్స్ కు ఊతమిస్తూ రూ. 1,124 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇవాళ క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి ఆ నిధులను విడుదల చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఎంఎస్‌ఎంఈలకు రూ. 440 కోట్లు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్స్‌కు రూ. 684 కోట్లు అందించనుంది సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు ఈ రంగాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం ప్రోత్సాహకాలు రూ. 2,086.42 కోట్లకు చేరనున్నాయి.. పారిశ్రామికాభివృద్దికి వెన్నెముకగా నిలుస్తూ రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్స్‌కు ఊతమిస్తూ ప్రోత్సాహకాలు విడుదల చేయనుంది ప్రభుత్వం.. గత ప్రభుత్వం 2015 నుంచి ఎంఎస్‌ఎంఈలకు బకాయి పెట్టిన రూ. 904 కోట్లు, స్పిన్నింగ్ మిల్స్‌కు బకాయి పెట్టిన రూ. 684 కోట్లు మొత్తం రూ. 1,588 కోట్లు బకాయిలు సైతం జగన్ ప్రభుత్వం చెల్లించిందని చెబుతున్నారు…
ఇక, రూ. 25,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించేలా కొప్పర్తిలో వైఎస్‌ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను 3,155 ఎకరాల విస్తీర్ణంలో విద్యుత్, నీరు, సీఈటీపీలు మరియు ఎస్టీపీల వంటి అత్యున్నత మౌలిక సదుపాయాలతో బహుళ ఉత్పత్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్‌గా ప్రభుత్వం అభివృద్ది చేస్తుంది. తద్వారా 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం దొరకనుంది.. ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ. 10,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించడానికి కొప్పర్తిలో రూ. 730.50 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ద్వారా 30,000 మందికి ఉపాధి లభించనుంది.. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న క్రియాశీలక చర్యలతో, రూ. 5,204.09 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన 16,311 ఎంఎస్‌ఎంఈలు అదనంగా 1,13,777 మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలతో లబ్దిపొందుతున్న మొత్తం యూనిట్లలో 62 శాతం వాటా ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులదే, ప్రోత్సాహకాలు పొందుతున్న యూనిట్లలో 42 శాతం అక్కచెల్లెమ్మలు ఉన్నారని గణాంకాలు చెబుతోంది సర్కార్.
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
వైఎస్సార్ నవోదయం కింద 1,08,292 ఎంఎస్‌ఎంఈల బ్యాంకు ఖాతాలకు చెందిన సుమారు రూ. 3,236.52 కోట్ల రుణాల రీ షెడ్యూల్… 2,49,591 ఎంఎస్‌ఎంఈల బ్యాంకు ఖాతాలకు అత్యవసర క్రెడిట్ లైన్ హమీ పథకం (ఈసీఎల్‌జీఎస్) కింద రూ. 5,973 కోట్ల బ్యాంకు రుణాలతో అదనపు వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇవ్వనున్నారు.. వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రూ. 30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. దీని ద్వారా 46,119 మందికి ఉపాధి లబిస్తోంది. ఇదే కాకుండా రూ. 36,384 కోట్ల పెట్టబడితో త్వరలో ప్రారంభం కానున్న మరో 62 భారీ, మెగా ప్రాజెక్ట్‌లు 76,916 మందికి ఉపాధిని కల్పించనున్నాయి. దేశంలో తొలిసారిగా పారిశ్రామిక వేత్తల ఫీడ్ బ్యాక్‌ని కూడా తీసుకుని జరిపిన సర్వే ఆధారంగా, వరల్డ్ బ్యాంకు మరియు కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను ప్రకటించిన స్టేట్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ జాతీయ ర్యాంకులలో ఏపీ తొలిస్ధానంలో నిలిచింది. ఇన్వెస్టర్లు ఈ ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి, విశ్వసనీయతకు ఇది నిదర్శనం అంటున్నారు అధికార పార్టీ నేతలు. యూనిట్‌కు కేవలం రూ. 2.48 పైసల ఖర్చుతో 30 సంవత్సరాల పాటు రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు 30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ 10 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టెండర్లను పిలవడం జరగగా.. త్వరలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!