కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.. తర్వాత ఆ ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ దిగినా.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ నుంచి అదే స్థాయిలో విమర్శలు వచ్చాయి.. ఇక, నిన్న గాంధీ భవన్ వేదికగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్.. ముఖ్యంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని టార్గెట్ చేశారు.. అయితే, మధు […]
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై మరోసారి ఫిర్యాదు చేసింది వైసీపీ… ఇవాళ ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసిన వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామ కృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని కోరారు.. ఈ సందర్భంగా రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మరిన్ని ఆధారాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీలు.. వైసీపీ టికెట్ మీద గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు […]
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్… తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ… సోనియాను ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నాడు.. ఆయనే గతంలో సోనియాను బలి దేవత అన్నారని వ్యాఖ్యానించారు.. రేపు చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా అంటాడు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. టీడీపీ పాత వాసనలు ఇంకా పోలేదని.. టీపీసీసీ కాదు తెలుగు దేశం కాంగ్రెస్ అని కాంగ్రెస్ నేతలే అంటున్నారని కామెంట్ చేశారు.. నోట్ల […]
కేసీఆర్‌పై ఆరోపణలు, విమర్శలు చేసి గెలవాలంటే అది సాధ్యం కాదని.. కేసీఆర్ కంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమిస్తేనే అది సాధ్యమంటూ సలహా ఇచ్చారు మంత్రి కేటీఆర్.. తెలంగాణ భవన్లో ఇవాళ సింగరేణి బీఎంఎస్ ప్రిసెడెంట్ మల్లయ్య.. టీఆర్ఎస్లో చేరారు.. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ సందర్భంగా విపక్షాలపై సెటైర్లు వేశారు.. మార్కెట్ లోకి కొత్త బిచ్చగాళ్ల వచ్చారు… వాళ్లు ఎవరో మీకు తెలుసన్నారు.. నిన్న మొన్న పదవులు […]
కేంద్ర కేబినెట్లో భారీ ప్రక్షాళన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా.. 15 మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక, తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు.. నరేంద్ర మోడీ – ప్రధానమంత్రి, శాస్త్ర సాంకేతిక శాఖను పర్యవేక్షించనున్నారు. రాజ్‌నాథ్ సింగ్ – రక్షణ శాఖ అమిత్‌షా – హోంశాఖ, సహకారశాఖ నితిన్ గడ్కరీ – కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ […]
కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా కిందికి దిగి వస్తుండడంతో… కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది… ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలు యథావిథిగా నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.. కోవిడ్ నిబంధనలు […]
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కోల్‌కతా హైకోర్టు షాక్ ఇచ్చింది. న్యాయ వ్యవస్థపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ 5 లక్షల ఫైన్ విధించిన న్యాయ స్థానం.. జడ్జిలపై మమత తప్పుడు ఆరోపణలు సరికాదని పేర్కోంది. నందిగ్రామ్ ఎన్నికల లెక్కింపునకు సంబంధించిన కేసును విచారిస్తున్న కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌషిక్ చందాకు.. బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల బెంగాల్ సీఎం మమత ఆరోపించారు. కౌషిక్ చందాను ఆ కేసు నుంచి తప్పించి.. పిటిషన్‌ను మరొక జడ్జికి […]
36 మంది కొత్త ముఖాలు.. ఏడుగురికి ప్రమోషన్.. మోడీ 2.ఓ కేబినెట్లో ఈక్వేషన్స్ ఇవి..! కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. చివరి వరకు ఉత్కంఠ రేపింది. మొత్తం 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రాంతాలు, సామాజిక లెక్కలతో మోదీ తన కొత్త టీమ్‌ను ఎంపిక చేశారు. మొత్తం మందిలో 15 మందికి కేబినెట్ హోదా దక్కింది. మహారాష్ట్రకు చెందిన నారాయణ రాణెను మోడీ తన టీమ్‌లోకి తీసుకున్నారు. అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్‌కి కేబినెట్ హోదా దక్కింది. […]
బంజారాహిల్స్ లో హల్ చల్ చేసిన హైదరాబాద్ మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్‌పై రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు.. భూ వివాదంలో జోక్యం చేసుకున్నారు మాజీద్ హుస్సేన్.. ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండటంతో ఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.. అయితే. పోలీసులపై విరుచుకుపడుతూ అసభ్యకర రీతిలో మాట్లాడారు మాజీ మేయర్.. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాకు ఎక్కి హల్ చల్ చేసింది… మాజీద్ హుస్సేన్ పై చర్యలు […]