ఆయనో పోలీసు ఉన్నతాధికారి.. ఓ మహిళా కానిస్టేబుల్‌లో కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో రెచ్చిపోయాడు.. స్విమ్మింగ్‌పూల్‌లో అసభ్యరీతిలో, అభ్యంతరకరంగా ప్రకవర్తించాడు.. అయితే, డీఎస్పీ స్విమ్మింగ్‌పూల్ చేసిన హాట్ పనులను ఎవరూ వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు.. దీంతో.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఇది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో.. ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు..
స్విమ్మింగ్‌పూల్‌లో రెచ్చిపోయిన డీఎస్పీ, మహిళా కానిస్టేబుల్.. సరససల్లాపాల్లో మునిగిపోయారు.. ఆ వీడియోలో ఆరేళ్ల చిన్నారి కూడా ఉంది.. తమ పక్కన ఎవ్వరున్నారు.. తాము ఏం చేస్తున్నామో అనే సంగతి మర్చిపోయి.. స్విమ్మింగ్‌పూల్‌లో రెచ్చిపోయిన వీడియో కాస్తా వైరల్ కావడంతో.. సీరియస్‌గా తీసుకున్న రాజస్థాన్ పోలీసు ఉన్నతాధికారులు.. డీఎస్పీ, మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. సదరు డీఎస్పీ అజ్మేర్ జిల్లాలో పనిచేస్తుండగా.. మహిళా కానిస్టేబుల్.. జైపూర్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్నట్టుచెబుతున్నారు పోలీసులు. ఇక, రాజస్థాన్ పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ).. సదరు డీఎస్పీని అరెస్ట్ చేసింది.. పోలీసు అధికారి సైనీని గురువారం రాత్రి ఉదయ్‌పూర్‌లోని ఒక రిసార్ట్ లో అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు.. వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడంతో పోలీసులు స్వయం ప్రతిపత్తిని తీసుకుని, సైనీని అరెస్ట్ చేశామన్నారు.. సైబర్ క్రైమ్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైందని.. మహిళా కానిస్టేబుల్ తన బిడ్డతో ఉన్నందున ఆమెను అరెస్టు చేయలేదు. తర్వాత అదుపులోకి తీసుకోనున్నట్టు ఎస్‌వోజీ అధికారులు చెబుతున్నారు.