వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో… మాఫియా లీడర్లకు బాహుబలులకు టికెట్లు ఇచ్చేది లేదని.. బీఎస్పీ అధినేత మాయావతి స్పష్టం చేశారు. అజమ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్తార్ అన్సారీని తప్పించిన… అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారామె. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాయావతి.. ప్రజల ఆకాంక్షలు, అంచనాలకు అనుగుణంగా ఉండాలన్నారు. అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా శ్రద్ధ వహించాలని పార్టీ ఇంచార్జీకి విజ్ఞప్తి చేసినట్లు మాయావతి పేర్కొన్నారు. ఇక, అజమ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్తార్ అన్సారీని తప్పించి ఆ స్థానం నుంచి యూపీ బీఎస్పీ అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్ పేరు ఖరారు చేశారు. మరోవైపు.. ప్రజల అంచనాలను చేరుకోవాడానికి పార్టీ అందుకునే విధంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని పార్టీ ఇంచార్జీకి సూచించారు మాయావతి.