కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఇతర కులాలకూ రూ.10 లక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇప్పటికే దళితుల ఆర్థిక అవసరాల లక్ష్యంతో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేసిన ఆయన.. ఆర్థిక సామాజిక వివక్ష ను బద్దలు కొట్టాలనే ఆశయం తో దళిత బంధు పథకo అని సీఎం పునరుద్ఘాటించారు. హుజూరాబాద్, వాసాలమర్రితో సహా మరో నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నామని.. నాలుగు జిల్లాలకు చెందిన నాలుగు మండలాల్లో కూడా రెండు మూడు వారాల్లోనే దశలవారీగా నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, కేవలం దళితులే కాదు.. ఇతర కులాల్లోని పేదలకు కూడా రూ. 10 లక్షల సహాయం అందించాలనే ఆలోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్.. వరుస క్రమంలో అందరికీ దళిత బంధు లాంటి పథకం తీసుకొస్తామన్నారు.
అయితే, దళితబంధు పథకం అమలు విషయంలో మిగతా వర్గాలు సహకరించాలని కోరారు సీఎం కేసీఆర్.. వచ్చే ఏడాది నుంచి బడ్జెట్‌లో దళితబంధు పథకం కోసం రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామన్న ఆయన.. సంవత్సరానికి రెండు లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేస్తామన్నారు.. పరిస్థితులు అనుకూలిస్తే ఇంకా నిధులు పెంచుకుంటూ పోతామని స్పష్టం చేసిన సీఎం.. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు.. రైతు బంధు సహా ఇతర పథకాలు అమలు చేసినప్పుడు దళితులెవరూ అభ్యంతరం చెప్పలేదన్న ఆయన.. కాకపోతే తమకు కూడా మేలు చేయాలని మాత్రమే దళితజాతి ప్రజలు కోరుకున్నారని తెలిపారు. ఇప్పుడు దళితబంధు పథకం అమలు విషయంలో కూడా మిగతా వర్గాలు అదే స్థాయిలో సహకరించాలి కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.
Also Read
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?